జల్లికట్టుకు, ఏపీ ప్రత్యేక హోదాకు లింకుపెట్టిన పవన్.!
జల్లికట్టుకు, ఏపీ ప్రత్యేక హోదాకు లింకుపెట్టిన పవన్.!
హైదరాబాద్:జల్లికట్టు ఉద్యమం ఆంధ్రులకు స్పూర్తిదాయకమని సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. జల్లికట్టుకోసం ప్రజలు కులమతాలకు అతీతంగా తమిళులంతా పోరాడిన తీరు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేర్చుకోవాల్సింది చాలా ఉందన్నారు పవన్. ఆంధ్రా నాయకులు కూడా అలాంటి సంఘీభావాన్ని ప్రకటించాలని చెబుతూ ఓ లేఖ విడుదల చేశారు.జల్లికట్టుపై నిషేదానికి నిరసనగా లక్షలాదిమంది మెరీనాబీచ్ చేరినప్పటికీ ఎక్కడ హింసకు తావులేకుండా నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు.
తమిళుల సంఘటిత శక్తి, అహింసాయుతమైన పద్ధతి నన్ను కదిలించాయని లేఖలో పవన్ పేర్కొన్నారు. జల్లికట్టు ఉద్యమ స్పూర్తితో " ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా సాధించాలన్నారు. అయితే వ్యాపార అవసరాలు ఎక్కువగా ఉండి రాజకీయ నిబద్దత తక్కువగా ఉన్న మన రాజకీయ నేతలు తమిళ ఉద్యమం నుంచి ఎంత వరకు స్పూర్తి పొందురనేదానిపై నాకు కొన్ని సందేహాలున్నాయి.. అయితే ఈ విషయంలో రాజకీయ నేతలు రాజీపడినా ప్రజలు మాత్రం రాజీపడబోరన్న గట్టి నమ్మకం నాకుందని పవన్ లేఖలో ప్రస్తావించారు.
Comments
Post a Comment