కొత్తకొండకు ఏసీ బస్సులు

కొత్తకొండకు ఏసీ బస్సులు
బాలసముద్రం, AMS NEWS : కొత్తకొండ జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ వరంగల్‌ రీజియన్‌ హన్మకొండ నుంచి ఏసీ బస్సులను నడపనుంది. మొదటిసారిగా హన్మకొండ బస్టాండ్‌ నుంచి కొత్తకొండకు ఏసీ రాజధాని సేవలను అందించనున్నారు. ప్రైవేటు వాహనాల పోటీని తట్టుకునేందుకు ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఆలోచన చేసింది. దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు, వరంగల్‌ జిల్లా నుంచి బయలుదేరే భక్తులకు ఏసీ బస్సు సౌకర్యం కల్పించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక బస్సులు హన్మకొండ నుంచి పెద్దవారికి రూ.40, పిల్లలకు రూ.20 టికెట్‌ ఛార్జీ తీసుకుంటుండగా, ఏసీ బస్సులకు ఒక్కో టికెట్‌కు అదనంగా రూ.10 చెల్లించాలని అధికారులు పేర్కొన్నారు. అవసరాన్నిబట్టి ఎన్ని ట్రిప్పులైనా నడిపేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

Comments

Popular posts from this blog

రాక్షస గుహలు.. సొరంగ మార్గాలు.

ఎర్రబెల్లి కుటుంబసభ్యులకు సీఎం పరామర్శ

'కప్పిపుచ్చుకోవడానికే రిజర్వేషన్లు'