ఏటీఎంల్లో క్యాష్ విత్ డ్రా పరిమితులు ఎత్తివేత
ఏటీఎంల్లో క్యాష్ విత్ డ్రా పరిమితులు ఎత్తివేత
► అయితే.. వారానికి 24 వేలే!
► కరెంట్ అకౌంట్ల పరిమితి రూ. లక్షకు పెంపు
► పాత నోట్లు డిపాజిట్ చేసుకునేందుకు ఎన్నారైలకు అదనపు సమయం
ముంబై: ఏటీఎంల్లో విత్‌డ్రా పరిమితిని రూ. 10 వేలకు పెంచుతూ భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. అయితే వారంలో విత్‌డ్రా పరిమితి రూ. 24 వేలను కొనసాగించింది. అలాగే కరెంట్ అకౌంట్ల నుంచి వారానికి రూ. లక్ష వరకు తీసుకోవచ్చని వెల్లడించింది. దీంతో చిన్న స్థాయి వర్తకులకు కాస్త ఊరట లభించనుంది.
ఆర్బీఐ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. అలాగే పెద్ద నోట్ల రద్దు సమయంలో విదేశాల్లో ఉన్న ఎన్నారైలు, దేశ పౌరులకు తమ వద్ద ఉన్న పాత రూ. 500, రూ. 1,000 నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునేందుకు ఆర్బీఐ అదనపు సమయం ఇచ్చింది. నవంబర్ 9న పెద్ద నోట్ల రద్దు తర్వాత రూ. 2,500గా ఉన్న విత్‌డ్రా పరిమితిని ఆర్బీఐ జనవరి 1 నుంచి రూ. 4,500కు పెంచిన సంగతి తెలిసిందే.
కరెంట్ అకౌంట్లలో వారానికి రూ. 50 వేలుగా ఉన్న పరిమితిని ప్రస్తుతం రూ. లక్షకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెద్ద నోట్లు రద్దు అయ్యి డిసెంబర్ 30కు 50 రోజులు పూర్తయినా ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. ప్రస్తుతం ఆర్బీఐ నిర్ణయంతో ప్రజలకు కాస్త ఊరట లభించనుంది.

--------------------------------------------AMR NEWS TELANGANA----------------------------------
న్యూఢిల్లీ : ఏటీఎంల్లో నగదు విత్ డ్రాయల్స్ పై ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఏటీఎంల్లో విధించిన క్యాష్ విత్ డ్రా నిబంధనలను కరెంట్ ఖాతాదారులకు, క్యాష్ క్రెడిట్ ఖతాదారులకు, ఓవర్ డ్రాఫ్ట్ ఖాతాదారులకు ఎత్తివేస్తున్నట్టు రిజర్వు బ్యాంకు ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు 2017 ఫిబ్రవరి 1నుంచి అమల్లోకి రానున్నట్టు ఆర్బీఐ పేర్కొంది. అయితే సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులకు ప్రస్తుతమున్న పరిమితులు యథాతథంగా కొనసాగుతాయని తెలిపింది.
Comments
Post a Comment