జల్లికట్టు విషాదం: ఇద్దరి మృతి
- Get link
- X
- Other Apps
జల్లికట్టు విషాదం: ఇద్దరి మృతి
చెన్నై: భారీ ఆందోళనల అనంతరం తమిళనాడులో తిరిగి ప్రారంభమైన జల్లికట్టు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పుదుకొట్టై జిల్లాలోని రాపూసల్ గ్రామంలో ఆదివారం జల్లికట్టు ఆడుతుండగా ఇద్దరు మృతిచెందారు. ఎద్దును లొంగదీసుకునే ప్రయత్నంలో రాజా(30), మోహన్ (30) అనే యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతిచెందారు. ఇదే ఘటనలో మరో మరో 57మందికిపైగా గాయాలయ్యాయి.150కిపైగా ఎద్దులతో మూడున్నర గంటలు జల్లికట్టును నిర్వహించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ భాస్కర్ ఈ జల్లికట్టును ప్రారంభించారు. ఆయన సమక్షంలోనే ఈ ప్రమాదం జరిగింది.
ఇదిలాఉంటే, జల్లికట్టుకు ప్రధాన కేంద్రమైన మదురై జిల్లా అలంగానల్లూరులో క్రీడా పోటీలు అనూహ్యంగా రద్దయ్యాయి. సీఎం పన్నీర్ సెల్వం నేటి ఉదయం జెండా ఊపి జల్లికట్టును ప్రారంభించేందుకురాగా, "శాశ్వత పరిష్కారం వచ్చే వరకు క్రీడను ప్రారంభించవద్దు" అంటూ స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో సీఎం జెండా ఊపకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక తిరుచిరాపల్లి జిల్లా పుడుపట్టి గ్రామంలో వంద ఎద్దులతో 500 మంది క్రీడాకారులు జల్లికట్టు ఆడారు. వెళ్లిపోయారు. (జల్లికట్టుకు దళితులు దూరం)
జంతు కారుణ్య సంస్థ పెటా దాఖలుచేసిన పిటిషన్‌ను విచారించిన అనంతరం దేశ అత్యున్నత న్యాయస్థానం జల్లికట్టుపై నిషేధం విదించిన సంగతి తెలిసిందే. అయితే ఆట నిర్వహణకు అడ్డంకులు తొలగిస్తూ తమిళనాడు ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ను గవర్నర్ విద్యాసాగర్ శనివారం ఆమోదించారు. జల్లికట్టు కోసం ప్రజలు భారీ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఆర్డినెన్స్ సరైన చర్యేనని, నిరసనకారులు ఇక ఇళ్లకు వెళ్లాలని ఆయన కోరినట్లు రాజ్‌భవన్ తెలిపింది. (కట్టు తెంచుకున్న జల్లికట్టు)

Comments
Post a Comment