మల్లన్న ముందు మోకరిల్లిన భక్తులు
బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు ఆధ్యాత్మిక సందడి
శివసత్తులు, బోనాలతో తరలివచ్చిన భక్తజనం 
రాయపర్తి, ఐనవోలు, AMS NEWS: ఐనవోలు బ్రహ్మోత్సవాల్లో స్వామివారిని దర్శించుకుని తరించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మల్లన్న ముందు పిల్లాపాపలతో మోకరిల్లారు. ఉత్సవాల్లో రెండో రోజైన శుక్రవారం ఆలయం భక్తులతో కక్కిరిసింది. రాష్ట్రంలోని నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తజనంతో నిండిపోయింది. వేలాదిగా భక్తులు తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది. అత్యంత భక్తిశ్రద్ధలతో చేసిన బోనాలను మల్లికార్జునస్వామి, రేణుక ఎల్లమ్మలకు వేర్వేరుగా సమర్పించుకున్నారు. శివసత్తులు బోనాలు నెత్తినపెట్టుకుని డప్పు చప్పుళ్ల మధ్య సంప్రదాయబద్ధంగా నృత్యాలు చేస్తూ స్వామివారి దర్శనానికి వచ్చిన తీరు విశేషంగా ఆకట్టుకుంది. ఉదయం నుంచి రాత్రి వరకు గుంపులు గుంపులుగా నృత్యాలతో మల్లన్నస్వామి దర్శనానికి తరలివచ్చారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను వేంచేయించిన రథాన్ని ఆలయం చుట్టు తిప్పారు. ఆలయంలోని నటరాజస్వామి విగ్రహం వద్ద తొలిసారిగా ప్రదర్శించిన పేరిణి నృత్యం ఆకట్టుకుంది. వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌, మహబూబాబాద్‌ ఎంపీ సీతారాంనాయక్‌, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌, స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్‌ పెద్ది సుదర్శన్‌రెడ్డి, నగర మేయర్‌ నన్నపనేని నరేందర్‌, కుడా ఛైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, తెరాస జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, ఎంపీపీ మార్నేని రవీందర్‌రావు, ఆలయ పునరుద్ధరణ కమిటీ ఛైర్మన్‌ గజ్జెల్లి శ్రీరాములు, వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ గుజ్జ సంపత్‌రెడ్డి, సర్పంచి పల్లకొండ సురేశ్‌ తదితరులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులతో పాటు ఆలయానికి విచ్చేస్తున్న ప్రజాప్రతినిధులు, ప్రముఖులకు కార్యనిర్వహణ అధికారి శేషుభారతి ఆధ్వర్యంలో సిబ్బంది దర్శన ఏర్పాట్లు చేశారు

Comments

Popular posts from this blog

రాక్షస గుహలు.. సొరంగ మార్గాలు.

ఎర్రబెల్లి కుటుంబసభ్యులకు సీఎం పరామర్శ

'కప్పిపుచ్చుకోవడానికే రిజర్వేషన్లు'