హైదరాబాద్ లో అనూహ్య ప్రమాదం
- Get link
- X
- Other Apps
హైదరాబాద్ లో అనూహ్య ప్రమాదం
హైదరాబాద్: ఊహించని ప్రమాదం పాదచారి ప్రాణం తీసింది. రోడ్డు దాటుతుండగా ఆటో రూపంలో మృత్యువు కబళించింది. ఆటో నేరుగా వచ్చి గుద్దడంతో పాదచారి సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ అనూహ్య ఘటన పాతబస్తీలోని శంషేర్ గంజ్ లో చోటుచేసుకుంది. ఘటనా స్థలంలోని సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.
ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా ఆటో ఒక్కసారిగా అతడిపైకి దూసుకువచ్చింది. నేరుగా వచ్చి అతడిని ఢీకొట్టింది. ఆటో ముందు టైరు ఊడిపోయి డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఊహించని విధంగా ప్రమాదం జరగడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. మృతుడి వివరాలు వెంటనే తెలియరాలేదు. ఆటోలో ఉన్న వారికి ఎటువంటి గాయాలు కాలేదని వీడియో రికార్డైన దృశ్యాలను బట్టి తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments
Post a Comment