పదే పదే.. అదే అదే!


>  రసాభాసగా జడ్పీ సర్వసభ్య సమావేశం 
>  నాలుగు అంశాలపైనే చర్చ 
>  నిధులు రావడం లేదని కాంగ్రెస్‌ సభ్యుల ఆందోళన

తంలో ఒక కలెక్టరే పోడియంపై కూర్చుండే వారు. ప్రస్తుతం వరంగల్‌ అర్బన్‌, వరంగల్‌ రూరల్‌, జనగామ, మహబూబాబాద్‌ కలెక్టర్లు జయశంకర్‌ జిల్లా కలెక్టర్‌కు బదులుగా జేసీ అమయ్‌కుమార్‌ ఆశీనులయ్యారు. 
వచ్చే సమావేశం నాటికి మిషన్‌ భగీరథ ద్వారా జనగామ జిల్లాలోని గ్రామాలకు నీటిని అందిస్తే కలెక్టర్‌ శ్రీ దేవసేనను సన్మానించాలని శ్రీహరి ప్రకటించారు. 
జడ్పీ ఛైర్‌పర్సన్‌, మంత్రులు, కలెక్టర్‌, సీఈవోలకు మహారాజ కుర్చీలను వేసేవారు. ప్రస్తుత సమావేశంలో సాధారణ కుర్చీలు వేసి తువ్వాళ్లను కప్పారు. 
సమావేశానికి వచ్చిన కలెక్టర్లకు జడ్పీ ఛైర్‌పర్సన్‌ పద్మ పుష్పగుచ్ఛం ఇచ్చి వేదికపైకి ఆహ్వానించారు. 
గత సమావేశాల్లో ఎజెండాకు ఒకే పుస్తకం ఉండేది. ప్రస్తుతం ఐదు పుస్తకాలను తయారు చేశారు. 
పర్యావరణ పరిరక్షణకు ప్లాస్టిక్‌ను వాడవద్దని ప్రభుత్వం చెప్పింది. అయినా సమావేశం మందిరంతో పాటుగా ద్వారం వద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

ఐదు జిల్లాలకు చెందిన ప్రభుత్వ అధికారులందరూ ఒకేసారి హాజరయ్యేవారు. ఆరు శాఖల అధికారులే సమావేశంలో కూర్చున్నారు. మిగిలిన వారిని వేరే గదిలో కూర్చోబెట్టారు. చాలా మంది అసహనానికి గురయ్యారు.
జిల్లాపరిషత్‌-warangal
జడ్పీ సర్వసభ్య సమావేశం శనివారం రసాభాసగా సాగింది. గత విధానమే పునరావృతమైంది. ముందుగా విద్య, వైద్యం, వ్యవసాయం, మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, ఆర్‌అండ్‌బీ శాఖలపై చర్చ జరగాలని ఎజెండాను ప్రవేశపెట్టారు. వెంటనే మహబూబాబాద్‌ జడ్పీటీసీ సభ్యుడు, కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ వెంకన్న, ఆత్మకూరు జడ్పీటీసీ సభ్యుడు, డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ లేతాకుల సంజీవరెడ్డి, ఖానాపురం ఎంపీపీ రవీందర్‌రావు లేచి స్థానిక సంస్థలకు నిధులు
రావడం లేదని, దీనివల్ల గ్రామాల్లో ప్రజలకు అవసరమైన ఎలాంటి పనులు చేయడం లేదని అన్నారు. గెలిచి మూడేళ్లవుతున్నా ఏం చేయలేకపోతున్నామని చెప్పారు. నిధులు వచ్చేందుకు కృషి చేయాలని పట్టుబట్టారు. వీరి ప్రసంగాన్ని మీడియా ప్రతినిధులు చిత్రీకరిస్తున్న సమయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కల్పించుకొన్నారు. విజువల్స్‌ తీసుకొని బయటకు వెళ్లాలని ఆదేశించారు. డీపీఆర్‌వో, ఇతరులను పురమాయించారు. వారు వచ్చి విలేకరులను బయటకు పంపించేందుకు ప్రయత్నించడంతో వాగ్వాదం జరిగింది. ఈ ఘటనతో సభలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. విధుల్లో ఉన్న సుబేదారి ఎస్సై నిబంధనలకు విరుద్ధంగా సమావేశ మందిరంలోకి వచ్చారు. జోక్యం చేసుకున్న వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ ఆమ్రపాలి ఎస్సైని బయటికి వెళ్లాలని సూచించారు. పోలీసులు ఎందుకు లోపలికి వచ్చారని ప్రశ్నించారు. ఫలితంగా సమావేశంలో గందరగోళం ఏర్పడింది. అనంతరం కాంగ్రెస్‌ పార్టీ జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు సమావేశాన్ని బహిష్కరించారు. ప్రభుత్వానికి , సమావేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జడ్పీ ముందు బైఠాయించారు. నిధులు ఇవ్వకుండా సమావేశం ఎందుకని ప్రశ్నించారు. అప్పుడే లోపలికి వస్తున్న శాసనమండలి విప్‌, ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లును అడ్డుకున్నారు. లోపలికి రావాలని సూచించినా వినలేదు. మీడియా ప్రతినిధులు సైతం జడ్పీ ముందు ఆందోళన చేశారు. మహబూబాబాద్‌ ఎంపీ సీతారాంనాయక్‌ వచ్చి ‘మీడియాను లోపలికి రానివ్వండి’ అని చెప్పడంతో అందరినీ అనుమతించారు. తర్వాత సమావేశం సజావుగా సాగింది.
కలెక్టర్ల పర్యవేక్షణ పెరగాలి...
విద్య, వైద్యం, వ్యవసాయం, మిషన్‌భగీరథపై చర్చించారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ పద్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ప్రతి సర్కారీ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. పీహెచ్‌సీల్లో ప్రసూతీలు పెరిగేలా చూడాలన్నారు. వైద్యులు అందుబాటులో ఉండాలని సూచించారు. కలెక్టర్లు ఆసుపత్రలను సందర్శించి వసతులపై వైద్య అధికారులతో చర్చించి సమకూర్చాలన్నారు. రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వాలన్నారు. గతంలో ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు తెచ్చుకొని పంటలను సాగు చేసేవారన్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆ అప్పులూ దొరకడం లేదన్నారు. ఇబ్బందులు పడుతున్నారన్నారు.పాలనాధికారులు బ్యాంకు అధికారులతో సమావేశాలను ఏర్పాటు చేసి అర్హులైన ప్రతి రైతుకు రుణాలు ఇచ్చే విధంగా చూడాలన్నారు. మిషన్‌భగీరథ పనులను వేగవంతం చేసి జనవరి చివరి వరకు జనగామ జిల్లాలో నీటిని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. మహబూబాబాద్‌, జనగామ చుట్టూ రింగ్‌ రోడ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రభుత్వం వచ్చే బడ్జెట్‌లో స్థానిక సంస్థలకు నిధులను కేటాయించేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల స్థానిక సంస్థలకు నిధులు రావడం లేదన్నారు. ఉపాధి హామీ పథకంలో జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీల వారీగా పనులు చేపట్టేందుకు అవసరమైన ప్రయత్నాలు చేస్తామన్నారు.

నాలుగు శాఖలపై చర్చ
సమావేశంలో నాలుగు శాఖలపై మాత్రమే చర్చ జరిగింది. వీటిపై అధికారులతో మాత్రమే మాట్లాడించారు. పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం చేప్పారు. మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశం ముగించారు. ముందుగా ఇటీవల మరణించిన జడ్పీ కో-అప్షన్‌ సభ్యుడు ఇబ్రహీంకు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ‘నేను జిల్లా పరిషత్‌ సమావేశం కోసం ఛండీగఢ్‌ నుంచి వచ్చాను. నేను వచ్చే సరికి సమావేశం ముగిసింది. మిషన్‌ భగీరథలో అవినీతి, అక్రమాలు జరిగాయి. దీనిపై మాట్లాడేందుకు వస్తే సమావేశం అయిపోయింది. ఇంత ఆధ్వానంగా ఉంటే ఎలా’ అని ఎంపీ రాపోలు ఆనందభాస్కర్‌ అన్నారు. సమావేశంలో ఎంపీలు గరికపాటి మోహన్‌రావు, పసునూరి దయాకర్‌, ఎమ్మెల్యేలు టి. రాజయ్య, శంకర్‌నాయక్‌, రమేశ్‌, చల్లా ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రాక్షస గుహలు.. సొరంగ మార్గాలు.

ఎర్రబెల్లి కుటుంబసభ్యులకు సీఎం పరామర్శ

'కప్పిపుచ్చుకోవడానికే రిజర్వేషన్లు'