ఎర్రబెల్లి కుటుంబసభ్యులకు సీఎం పరామర్శ AMR న్యూస్ తెలంగాణ/ వరంగల్, జనగామ జిల్లా: పాల కుర్తి నియోజకవర్గ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు కుటుంబసభ్యులను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పరామర్శించారు. దయాకర్‌రావు తల్లి ఆదిలక్ష్మి (83) అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందారు. అదే రోజు సాయంత్రం మృతదేహాన్ని వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరిలోని వారి స్వగృహానికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 11.30 గంటలకు హెలికాప్టర్లో ముఖ్యమంత్రి పర్వతగిరికి చేరుకున్నారు. హెలిప్యాడ్ నుంచి ప్రత్యేక బస్సులో దయాకర్‌రావు ఇంటికి చేరుకొని ఆదిలక్ష్మి మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. దయాకర్‌రావు, ఆయన సోదరుడు ప్రదీప్‌రావు, ఇతర కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఎంపీ వినోద్‌కుమార్, పౌరసరఫరాల కార్పొరేషన్ ఛైర్మన్ పెద్దిసుదర్శన్‌రెడ్డి హెలికాప్టర్లో వచ్చారు. అంతకు ముందు ఉప ముఖ్యమంత్రి కడియం, స్పీకర్ మధుసూదనాచారి, జడ్పీ ఛైర్పర్సన్ పద్మ, పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్, సీతారాంనా...
Comments
Post a Comment