నక్సల్స్‌కు దమ్ముంటే ఆ ఎమ్మెల్యేలను కాల్చాలి: సోమువీర్రాజు
AMR NEWS TELANGANA / రాజమండ్రి: బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు నక్సల్స్‌పై సంచలన వ్యాఖ్యాలు చేశారు. పేదలను, సామాన్యులను చంపడానికా నక్సల్స్ ఉన్నది అని సోమువీర్రాజు ప్రశ్నించారు. అవినీతిని అంతం చేయడానికే పుట్టుకొచ్చామని చెప్పే నక్సల్స్.. దమ్ముంటే నలుగురైదుగురు అవినీతి ఎమ్మెల్యేలను కాల్చిచంపాలని ఆయన డిమాండ్ చేశారు. అవినీతి అడవుల్లో లేదని, ప్రజల మధ్య ఉందని సోమువీర్రాజు అభిప్రాయపడ్డారు. నక్సల్స్ అందరూ అడవులను వీడి జనాల మధ్యకు రావాలని ఎమ్మెల్సీ సోమువీర్రాజు కోరారు. కొంతమంది నక్సలైట్లు బెదిరింపుల ద్వారా వచ్చిన డబ్బులను అడవుల్లోని డంపుల్లో దాస్తున్నారని సోమువీర్రాజు ఆరోపించారు.
Comments
Post a Comment