కోడిపందాల్లో ఢాం...ఢాం...
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని  శ్రీనివాసపురం గ్రామమది.. సంక్రాంతి సందర్భంగా అంతా కోడి పందాల్లో ఉత్సాహంగా బిజీగా ఉండగా, హఠాత్తుగా ఢాం, ఢాం అన్న శబ్దాలు విని భయపడిపోయి పరుగులు తీశారు.

తన గన్ తీసి ఓ వ్యక్తి గాల్లోకి మూడుసార్లు కాల్పులు జరిపి అందర్నీ బెంబేలెత్తించాడు. ఈ ఘనుడిని ఖమ్మం జిల్లాకు చెందిన దయాకర్ గా గుర్తించారు. ఫైర్ చేసిన ఈ అత్యుత్సాహపరుడిని పోలీసులు అరెస్టు చేసి జంగారెడ్డిగూడెం పోలీసు స్టేషనుకు తరలించారు.

Comments

Popular posts from this blog

రాక్షస గుహలు.. సొరంగ మార్గాలు.

ఎర్రబెల్లి కుటుంబసభ్యులకు సీఎం పరామర్శ

'కప్పిపుచ్చుకోవడానికే రిజర్వేషన్లు'