దేశ్ బచావో పోస్టర్ విడుదల చేసిన పవన

AMR NEWS TELANGANA /PAVAN TWIT:జనసేన అధినేత పవన​ కళ్యాణ్  తనదైన శైలిలో ప్రత్యేక హోదా సాధనకు సిద్ధమవుతున్నారు. జల్లికట్టు ఉద్యమ స్పూర్తితో కేంద్రం మెడలు వంచేందుకు సిద్ధం కావాలని పిలుపునివ్వడంతో పాటు జనసేన నిరసనను మ్యూజికల్ ఆల్బం ద్వారా వ్యక్తం చేస్తున్నట్టు  వెల్లడించారు. ముఖ్యంగా ప్రత్యేక హోదా నినాదాన్ని ప్రజల్లో బలంగా నాటేందుకు  ఈ  ఆల్బమ్ ను విడుదల  చేస్తున్నట్టు  తన ట్విట్టర్లో ప్రకటించారు.
ఇచ్చిన మాట నిలబెట్టు కోకపోతే, తిరగబడతామని తెగేసి చెబుతున్న పవర్‌ స్టార్‌  ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈనెల 26న విశాఖ ఆర్కేబీచ్ లో జరగబోయే నిరసన కార్యక్రమానికి ప్రతీ ఆంధ్రుడు ఓ సైనికుడై కదలి రావాలన్నారు. అవకాశవాద, క్రిమినల్ రాజకీయాలకు వ్యతిరేకంగా ఆల్బమ్ ద్వారా జనసేన గళాన్ని వినిపించిననున్నట్లు పవన్ తన ట్వీట్‌​ లో తెలిపారు. జనసేన యూట్యూబ్‌ చానల్‌ ద్వారా  ఒక మ్యూజికల్​ ఆల్బంను రిలీజ్‌ చేయనున్నట్టు వెల్లడించారు. దీనికి సంబంధించి దేశ్ బచావో అనే నినాదంతో పోస్టర్‌ ను ట్విటర్ లో  పవన్‌  పోస్ట్‌  చేశారు.

తొలుత ఫిబ్రవరి 5న ఆల్బమ్ విడుదల చేయాలని భావించినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో జనవరి 24నే విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది..

Comments

Popular posts from this blog

రాక్షస గుహలు.. సొరంగ మార్గాలు.

ఎర్రబెల్లి కుటుంబసభ్యులకు సీఎం పరామర్శ

'కప్పిపుచ్చుకోవడానికే రిజర్వేషన్లు'