ఆత్మీయ మహాసభను విజయవంతం చేయండి : ముత్తిరెడ్డి


జనగామ: సమాజంలో నిరక్షరాస్యత,వెట్టిచాకిరి, వెనుకబాటు తనం, అంటరానితనం, అసమానతలను రూపు మాపేం దుకు ఎందరో మహనీయులు త్యాగాలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమ గర్జన వేదిక ఆధ్వర్యంలో నిర్వ హించనున్న మహనీయుల ఆత్మీయ మహాసభ కరపత్రాలు, వాల్ పేపర్లను ఎమ్మెల్యే తన క్యాంపు ఆఫీసులో సోమవారం ఆవిష్కరించారు. ఈనెల 29న ప్రిస్టన్ గ్రౌండ్‌లో జరిగే మహాసభను జిల్లాలో అన్ని పార్టీల నాయకులు, మేధావులు, ప్రజలు, కవులు, నాయకులు హాజరై విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు ఏబేలు, వ్యవసాయ మార్కెట్ చైర్ పర్సన్ బండ పద్మ యాదగిరి రెడ్డి, బెజగం చంద్రయ్య, ముచ్చపల్లి కోటి, పాకాల అనిల్, మధు, సంజీవ, నాగరాజు, ఇజ్రాయల్, మేకలశ్రీనివాస్, పరుషరాములు, లక్ష్మయ్య, నిలిగొండ శ్రీనివాస్ పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

రాక్షస గుహలు.. సొరంగ మార్గాలు.

ఎర్రబెల్లి కుటుంబసభ్యులకు సీఎం పరామర్శ

'కప్పిపుచ్చుకోవడానికే రిజర్వేషన్లు'