వెంటాడిన మృత్యువు



-రోడ్డు ప్రమాదంలో మూడేళ్ల కొడుకు మృతి
-మూడేళ్ల క్రితం కూతురు దుర్మరణం
-తల్లి పరిస్థితి విషమం
-కన్నీరుమున్నీరుగా విలపించిన తండ్రి
-బాకనగర్ తండాలో విషాదం

జనగామ : ఆ కుటుంబాన్ని మృత్యువు వెంటాడింది. మూడేళ్ల క్రితం తొలిచూరు బిడ్డ ప్రమాదవశాత్తు మృత్యువాత పడగా, సోమవారం రోడ్డు ప్రమాదంలో తనయుడు దుర్మరణం పాలయ్యాడు. విషాదాన్ని నింపిన ఈ సంఘటన సోమ వారం మధ్యాహ్నం జనగామ-వడ్లకొండ మార్గ మధ్యలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జన గామ మండలం అడవికేశాపూర్ గ్రామం బాకనగర్ తండా కు చెందిన భూక్య చందు సరోజ దంపతులు. వీరికి వరుణ్ తేజ అనే మూడేళ్ల కుమారుడున్నాడు. మూడు రోజుల క్రితం సంక్రాంతి పండుగకు హైదరాబాద్‌లోని మౌలాలి లోని సరోజ పుట్టింటికి వెళ్లారు. బంధువులతో కలిసి ఘనంగా పండుగ జరుపుకున్న చందు కుటుంబీకులు సోమవారం ఉదయం ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి తిరుగు పయనమయ్యారు. కొద్దిసేపట్లో ఇంటికి చేరుకునే క్రమంలో జనగామ-వడ్లకొండ రహదారిలోని మలుపు వద్ద ఆర్టీసీ బస్సును ఓవర్‌టేక్ చేసే ప్రయత్రంలో ఎదు రుగా వస్తున్న జీపును చందు ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో చిన్నారి వరుణ్ తేజ అక్కడిక్కడే మృతిచెందాడు. సరోజ రెండు కాళ్ల విరిగిపోగా, చందుకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు 108 అంబులెన్స్‌లో గాయ పడిన ఇద్దరిని జనగామలోని ఏరియా ఆస్పత్రికి తరలిం చారు. మెరుగైన చికిత్స కోసం సరోజను వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మూడేళ్ల క్రితం పాప..


రోడ్డు ప్రమాదంలో ఒక్కాగానొక్క కొడుకును కోల్పోయిన చందు కుటుంబాన్ని మూడేళ్ల క్రితమే మృతువు వెంటాడింది. సరిగ్గా మూడేళ్ల ప్రాయంలో కూతురు వైష్ణవి మృతి చెందింది. ఇంటి ముందు ఆడుకుంటూ నీటితొట్టిలో పడి మరణించింది. హఠాత్ పరిణామానికి ఆ దంపతులు కోలుకోవడానికి చాలా కాలం పట్టింది. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం వరుణ్‌తేజ జన్మిం చాడు. వారు ఇతడిలోనే తమ కూతురును చూసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఎంతో అన్యోన్యంగా సాగుతున్న వారి కాపురాన్ని మరోసారి మృత్యువు కబలించింది. సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్‌లోని అమ్మమ్మ ఇంటికి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో చిన్నారి వరుణ్ తేజ మృత్యువాత పడ్డాడు. ఈ ఘటనలో తల్లి సరోజ రెండు కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడింది. చందుకు స్వల్ప గాయాలతో మృత్యువు నుంచి బయటపడినా కొడుకును కోల్పోవడం విషాదాన్ని నింపింది. ఈ ఘటనతో బాకనగర్ తండాలో విషాదం అలుముకుంది.

Comments

Popular posts from this blog

రాక్షస గుహలు.. సొరంగ మార్గాలు.

ఎర్రబెల్లి కుటుంబసభ్యులకు సీఎం పరామర్శ

'కప్పిపుచ్చుకోవడానికే రిజర్వేషన్లు'