పంచాయతీల రాజ్యాధికారం కోసం పోరాటం: కోదండరాం

పంచాయతీల రాజ్యాధికారం కోసం పోరాటం: కోదండరాం 

AMR న్యూస్ తెలంగాణ/జహీరాబాద్‌, కోహీర్‌: పంచాయతీల రాజ్యాధికారం కోసం సర్పంచుల ఐకాసకు మద్దతుగా పోరాటం కొనసాగిస్తామని రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం తెలిపారు. శనివారం జహీరాబాద్‌ మండలం లచ్చునాయక్‌తండాలో డీడీఎస్‌ పాత పంటల జాతర ప్రారంభ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం కోహీర్‌ మండలం కవేలి కూడలిలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో
మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేసి పంచాయతీ ఖాతాల్లో జమ చేసినా.. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిబంధకాలతో అభివృద్ధికి ఆటంకాలు కలుగుతున్నాయని ఆరోపించారు. కేరళ తరహాలో పంచాయతీలకు 74 రాజ్యాంగ హక్కులు కల్పిస్తామని ఎన్నికల్లో ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రామాల అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. గతేడాది వర్షాభావంతో సర్పంచులు అప్పులు చేసి, మహిళా సర్పంచులు బంగారం తాకట్టుపెట్టి గ్రామాలకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తే బకాయిలు చెల్లించలేదన్నారు. సర్పంచుల సమస్యలపై మండల, డివిజన్‌, జిల్లాస్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేలా కార్యాచరణ సిద్ధం చేస్తామని చెప్పారు.

Comments

Popular posts from this blog

రాక్షస గుహలు.. సొరంగ మార్గాలు.

ఎర్రబెల్లి కుటుంబసభ్యులకు సీఎం పరామర్శ

'కప్పిపుచ్చుకోవడానికే రిజర్వేషన్లు'