ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వాన్ని నిలదీశాం: రేవంత్

హైదరాబాద్: విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై అసెంబ్లీలో తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీశామని టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రూ. 4 వేల కోట్లకు పైగా ఫీజు బకాయిలు ఉంటే.. రూ.1500 కోట్లే విడుదల చేస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారని అన్నారు. మంత్రులు తోలు బొమ్మల్లా మారారని ఆయన విమర్శించారు. భూసేకరణ చట్టం, మైనారిటీల అంశాలపై మహమూద్‌అలీని మాట్లాడనివ్వకుండా అవమానించారని రేవంత్‌ విమర్శించారు.

Comments

Popular posts from this blog

రాక్షస గుహలు.. సొరంగ మార్గాలు.

ఎర్రబెల్లి కుటుంబసభ్యులకు సీఎం పరామర్శ

'కప్పిపుచ్చుకోవడానికే రిజర్వేషన్లు'