మహిళలపై స్వైన్‌ఫ్లూ పంజా.. వృద్దురాలు మృతి
మహిళలపై స్వైన్‌ఫ్లూ పంజా.. వృద్దురాలు మృతి
హైదరాబాద్:మహిళలపై స్వైన్ ఫ్లూ పంజా విసురుతోంది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బహుదూర్‌పురాకు చెందిన 64 సంవత్సరాల వృద్దురాలు మృతి చెందింది. ఈ వైరస్ బారిన పడే వారిలో మహిళలే అధికంగా ఉంటున్నారు. మృతుల్లో కూడా వారీ సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. గాంధీ ఆస్పత్రిలో గడిచిన ఇరవై రోజుల్లో చనిపోయిన వారంతా మహిళలే ఉండడం గమనార్హం. వాతావరణం చల్లగా ఉండడం, తేమ వాతావరణం ఎక్కువగా చోటు చేసుకోవడంతో వైరస్ విజృంభిస్తోంది. మహిళలే ఈ వైరస్‌తో ఇబ్బంది పడుతున్నారు. గృహణిలు, గర్బిణులు, బాలింతలు, పిల్లలు, వృద్ధులపై వైరస్ ఎక్కువగా ప్రభావం చూపుతోందని వైద్యులు పేర్కొంటున్నారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు హై రిస్కు జాబితాలో ఉన్నారని తెలిపారు.
Comments
Post a Comment