తల్లీబిడ్డల క్షేమమే ధ్యేయంగా..
తల్లీబిడ్డల క్షేమమే ధ్యేయంగా..
జనగామ, జనవరి 13 : మాతాశిశు సంరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పుట్టే బిడ్డ, తల్లి సురక్షితంగా ఉండాలని గర్భందాల్చిన మొదటి నెల నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవసరమైన వైద్య సేవలు, అందాల్సిన పౌష్టికాహారంపై అవగాహన కల్పించి నూరుశాతం ప్రసవాలు సర్కారు దవాఖానల్లోనే జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కేంద్రం మాతృత్వ ప్రయోజన కార్యక్రమం (ఎంబీపీ) పేరుతో రూపొందించిన ప్రత్యేక పథకంతోడు తమిళనాడు ప్రభుత్వ తరహాలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం సరికొత్త ప్రసూతి పథకాన్ని అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది.
గర్భిణులు, బాలింతలు పోషకాహారం తీసుకునేలా, శిశువులకు తొలి ఆరు నెలల్లో చనుబాలు ఇచ్చేలా ప్రోత్సహించడం పథకం లక్ష్యం. అయితే ఇందులో ఒక్కో గర్భిణీకి కేంద్రం అందజేస్తే రూ.6వేలకు తోడు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.6వేలు జోడించి మొత్తం రూ.12వేల నగదు, మూడు నెలలకు సరిపడా తల్లి, పిల్లకు పౌష్టికాహారం, 12 రకాల వస్తువులను ఉచితంగా అందజేయాలని నిర్ణయించారు. గర్భిణులు, బాలింతల్లో పోషకాహార లోపాలు, సరైన విశ్రాంతి తీసుకోకపోవడంతో ప్రసవాల సమయంలో మతా, శిశు మరణాలు జరుగుతున్నాయి. ప్రసవాలు ఆస్పత్రుల్లో కాకుండా ఇళ్ల వద్ద జరుగుతుండటం కూడా మరణాలకు కారణంగా అవుతుంది. ఆస్పత్రుల్లోనే వందశాతం ప్రసవాలు జరిగేలా చేయాలన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంకల్పం.
ఇందుకోసం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించే వారికోసం అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రవసం జరిగితే కేంద్రం రూ.700 జననీ సురక్ష యోజన కింద ఇస్తుంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా జేఎస్‌వై కింద రూ.300 అదనంగా కలిపి రూ.1000 వరకు ఇచ్చే వారు. ఇళ్ల వద్ద ప్రసవాలు జరగకుండా ప్రభుత్వాలు అనేక రకాల చర్యలు చేపడుతున్నా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వీటి సంఖ్య సగటున 40 శాతం కూడా మించడంలేదు. దీంతో మాతా, శిశు మరణాలు తగ్గడం లేదు. జాతీయ కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో పుట్టిన ప్రతి వెయ్యి మంది శిశువుల్లో సగటున 28 మంది చనిపోతున్నారు. లక్ష మంది ప్రసవిస్తే అందులో సగటున 92 మంది తల్లులు చనిపోతున్నారు. జనగామ జిల్లాలో ఏడాదికి సగటున 10,455మంది శిశువులు జన్మిస్తున్నారు. అంటే సగటున 300మంది శిశువులు చనిపోతున్నట్లు లెక్క.
ఏడాదికి సగటున తొమ్మిది మంది తల్లులు చనిపోతున్నారు. కేంద్రం ఐసీడీఎస్ ద్వారా మాతృత్వ ప్రయోజన కార్యక్రమం (ఎంబీపీ),కు తోడు రాష్ట్ర ప్రభుత్వం రెట్టింపుస్థాయిలో ప్రోత్సాహకం అందించాలని భావిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఆమలు చేయనున్న ప్రసూతి పథకం కింద గర్భం దాల్చిన తర్వాత పేరు నమోదు చేసుకున్న సమయంలో రూ.3వేలు, ఆస్పత్రిలో ప్రసవం అయిన తర్వాత రూ.1500, శిశువుకు మూడు నెలలు నిండాక రూ.1500 ఇస్తారు. తొలి రెండు కాన్పుల్లో జీవించి ఉన్న శిశువులకు మాత్రమే సాయం అందజేస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వరంగ సంస్థల్లో రెగ్యులర్ ఉద్యోగాలు చేస్తున్న మహిళలను మినహాయిస్తే మిగిలిన అందరికి ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకంలో ఆధార్ అనుసంధానం చేయడం వల్ల నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోనే నగదు జమ అవుతుంది. ఈ పథకం కింద జిల్లాలో 10,455 మహిళలకు లబ్ది చేకూరనుంది.
ఆన్‌లైన్‌లో మాతాశిశు వివరాలు..
దీనికితోడు గర్భణులు, శిశువులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రతీ గర్భిణీ, శిశువు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు ఆర్‌సీహెచ్(రీప్రొడక్టివ్ చైల్డ్‌హెల్త్) అనే పోర్టల్ ప్రారంభించింది. దీని ద్వారా గర్భిణులు, బాలింతలు, శిశువులు ఇప్పటి వరకు తీసుకున్న చికిత్సలు దేశంలోని ఎక్కడి ప్రభుత్వ ఆస్పత్రులైన ఆన్‌లైన్‌లో కనిపిస్తాయి. ఫలితంగా గత చికిత్సలకు అనుగుణంగా వైద్యసేవలు అందే వీలుంటుంది. జిల్లాలో 5,66, 376మంది జనాభా ఉంటే అందులో మహిళలు 2,82,728మంది ఉన్నారు.
జిల్లా కేంద్రంలో వంద పడకల ఏరియా ఆస్పత్రి, జిల్లా వ్యాపితంగా 13 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బచ్చన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తిలో 30 పడకల ఆస్పత్రులు ఉన్నాయి. బచ్చన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్ ఆస్పత్రులు మినహా మిగిలిన ఆస్పత్రుల్లో గైనకాలజిస్టు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గర్భిణుల పేర్లు వారి సొంత గ్రామాల్లో నమోదైనా పుట్టింటికి వెళ్లినప్పుడు, ఇతర గ్రామాలకు వెళ్లినప్పుడు వైద్యం కోసం మళ్లీ పరీక్షలు చేయించాల్సి వచ్చేంది. లేదంటే పేరు నమోదు చేసిన ఆస్పత్రికే వెళ్లాల్సి ఉండేది. ఇలాంటి ఇబ్బందులు లేకుండా ప్రస్తుతం జిల్లాలోనే బాలికలు, మహిళలు, గర్భిణులు, శిశువుల ఆధార్, బ్యాంకు అకౌంట్‌తో అనుసంధానం చేస్తారు. వీటితోపాటు ఆస్పత్రుల్లో మందుల వివరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తేలియంతోపాటు పక్కదారి పట్టకుండా ఈ-ఔషధి పేరుతో ఆన్‌లైన్ చేయనున్నారు.
పైలట్ ప్రాజెక్టుగా జనగామ మాతాశిశు ఆస్పత్రి..
ప్రభుత్వ దవాఖానల్లోనే పూర్తిస్థాయిలో ప్రసవాలు జరిగితే గ్రామీణ పేద ప్రజలపై ఆర్ధిక భారం తగ్గించేందుకు తమిళనాడు తరహా గర్ణిణీలకు భారీగా ప్రసూతి ప్రోత్సాహకం అందించాలని నిర్ణయించిన ప్రభుత్వం జనగామ శివారులోని చంపిక్‌హిల్స్ మాతా శిశు దవాఖానను మోడల్ పైలెట్ ప్రాజెక్టుగా తీసుకోబోంది.

Comments
Post a Comment