కేయూ డిగ్రీ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల వెల్లడి 
కేయూ క్యాంపస్‌, AMS NEWS: కాకతీయ విశ్వవిద్యాలయం డిగ్రీ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం సాయంత్రం కేయూ కమిటీ హాల్లో కేయూ ఉపకులపతి ఆచార్య ఆర్‌.సాయన్న పరీక్షల నియంత్రణ అధికారులతో కలిసి ఫలితాలను వెల్లడించారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఎం ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరాల ఫలితాలను విడుదల చేశారు. కేయూ పరిధిలోని ఉమ్మడి ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో 92 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. గతేడాది అక్టోబరు 21వ తేదీ నుంచి నవంబరు 18వ తేదీ వరకు నిర్వహించిన పరీక్షల్లో అన్ని జిల్లాల్లో అన్ని కేటగిరీల్లో మొత్తం 1,16,302 మంది పేర్లను నమోదు చేసుకోగా ఇందులో 1,01,658 మంది పరీక్షలకు హాజరయ్యారని వీసీ చెప్పారు. ప్రథమ సంవత్సరంలో అన్ని కేటగిరీల్లో 45,091 మంది పరీక్షలు రాయగా 7386 (16.40) మంది ఉత్తీర్ణులయ్యారు. రెండో సంవత్సరం అన్ని విభాగాల్లో 34,520 మంది పరీక్షలకు హాజరుకాగా 7464 (21.62 శాతం) మంది, ఆఖరు సంవత్సరంలో 21,846 మందికిగాను 3638 (16.93) మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. అన్ని విభాగాల్లో 18.30 ఉత్తీర్ణత శాతం నమోదైందని వివరించారు. కేయూ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కె.పురుషోత్తం, అదనపు అధికారి ఆచార్య పి.మల్లారెడ్డిలు ప్రసంగిస్తూ.. ఈ ఫలితాలను కేయూ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు చెప్పారు. ‘‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.కాకతీయ.ఏసీ.ఇన్‌’’ నుంచి ఫలితాలను తెలుసుకోవచ్చునని స్పష్టం చేశారు. కేయూ పరీక్షల అదనపు అధికారులు డాక్టర్‌ టి.శ్రీనివాసరావు, డాక్టర్‌ వి.రామచంద్రం, క్యాంపు అధికారులు డాక్టర్‌ పి.సదానందం, డాక్టర్‌ రాజ్‌కుమార్‌, జహీరోద్దిన్‌, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ శ్రీలత, ఉద్యోగులు పాల్గొన్నారు. 
  

Comments

Popular posts from this blog

రాక్షస గుహలు.. సొరంగ మార్గాలు.

ఎర్రబెల్లి కుటుంబసభ్యులకు సీఎం పరామర్శ

'కప్పిపుచ్చుకోవడానికే రిజర్వేషన్లు'