బాబుతో సాఫ్టా ? నో..నో..!

ap special :

పోలవరం సమస్య విషయంలో తాను  ఏపీ సీఎం చంద్రబాబు పట్ల మెతకగా వ్యవహరిస్తున్నాననడం సరికాదని జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నాడు. ఈ విషయంలో తనపై వస్తున్న విమర్శలను ప్రస్తావించిన ఆయన..సరైన రీతిలో జాగ్రత్తగా సమస్యను టీడీపీ ప్రభుత్వ దృష్టికి తేవడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిపాడు.
తమ భూములకు ప్రభుత్వం ఇస్తున్న పరిహారం తక్కువగా ఉందని, దీన్ని ఎక్కువగా చెల్లించేలా చూడాలని పోలవరం రైతులు ఆయనను కోరారు. దీనిపై స్పందించిన ఆయన-నేను రెండు నాల్కల ధోరణిలో మాట్లాడడం లేదు..సుమారు 40 ఏళ్ళ తెలుగుదేశం పార్టీ పట్ల కరకుగా వ్యవహరించాలన్నది నా అభిమతం కాదు..సమస్యను సానుకూలంగా పరిష్కరించేలా ఆచితూచి వ్యవహరిస్తా అని వారికీ హామీ ఇచ్చాడు.
ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఎదురైన ఇబ్బందుల దృష్ట్యా, జాగ్రత్తగా వెళ్తున్నానని పవన్ పేర్కొన్నాడు. టీడీపీ, వైకాపా వంటివి రెండో తరం పార్టీలని, టీడీపీ ఏర్పాటై సుమారు 40 ఏళ్ళు అవుతోందని, జనసేన పెట్టిన రెండేళ్ళలోనే వాటితో పోటీ పడాలన్న యోచన లేదని ఆయన చెప్పాడు. పార్టీని నింపడం, కమిటీలు వేయడం వంటివి పది రోజుల్లో చేయగలను..కానీ నా కంటూ స్పష్టమైన ఆలోచనా విధానం, ప్రణాళిక ఉన్నాయి అని తెలిపాడు. రాజధాని అమరావతి ప్రాంత లంక భూముల రైతులతో బాటు పోలవరం శివారు మూలలంక రైతులు కూడా ఆయనను కలిసి తమ గోడు విన్నవించుకున్న సంగతి తెలిసిందే.

Comments

Popular posts from this blog

రాక్షస గుహలు.. సొరంగ మార్గాలు.

ఎర్రబెల్లి కుటుంబసభ్యులకు సీఎం పరామర్శ

'కప్పిపుచ్చుకోవడానికే రిజర్వేషన్లు'