మెడికల్ కాలేజీని కేసీఆర్, హరీశ్‌రావులు సిద్ధిపేటకు తరలించుకుపోయారు

మెడికల్ కాలేజీని కేసీఆర్, హరీశ్‌రావులు సిద్ధిపేటకు తరలించుకుపోయారు

సంగారెడ్డి:సంగారెడ్డికి మంజూరైన మెడికల్ కాలేజీని సిద్ధిపేటకు తరలించడం దారుణంమంటూ సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావుపై కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్, హరీశ్ రావు ఇద్దరూ కలిసి మెడికల్ కాలేజీని సిద్ధిపేటకు తరలించుకుపోయారన్నారు. మెడికల్ కాలేజీ కోసం ప్రజా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అసమర్థతతోనే సంగారెడ్డికి మంజూరైన మెడికల్ కాలేజీ సిద్ధిపేటకు తరలిపోయింది, కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంక ఒక్కసారి కూడా సంగారెడ్డికి రాలేదన్నారు. సంగారెడ్డి తెలంగాణలో లేదనుకుంటున్నారేమే అనిఅన్నారు. మెడికల్ కాలేజీని సంగారెడ్డికి తరలించేంత వరకూ సీఎం కేసీఆర్‌, హరీశ్‌రావు‌ సంగారెడ్డికి వస్తే అడ్డుకుంటామన్నారు.

Comments

Popular posts from this blog

రాక్షస గుహలు.. సొరంగ మార్గాలు.

ఎర్రబెల్లి కుటుంబసభ్యులకు సీఎం పరామర్శ

'కప్పిపుచ్చుకోవడానికే రిజర్వేషన్లు'