తహసీల్దార్, ఆర్డీవో సంతకాల ఫోర్జరీ
నకిలీ పాస్‌పుస్తకాల కలకలం
తహసీల్దార్, ఆర్డీవో సంతకాల ఫోర్జరీ
రైతును మోసగించిన కారుడ్రైవర్
లబోదిబోమంటున్న బాధితుడు
స్టేషన్‌ఘన్‌పూర్, జనవరి 12 : స్టేషన్‌ఘన్‌పూర్‌లో నకిలీ పాస్‌పుస్తకాలు కలకలం సృష్టిస్తున్నాయి. అమాయక రైతులను ఆసరాగా చేసు కుని ఓ వ్యక్తి ఫోర్టరీ సంతకాలతో పాస్‌పుస్తకాలు ఇచ్చిన ఘటన వెలుగుచూసింది. స్టేషన్‌ఘన్‌పూర్ తహసీల్దార్ కారు డ్రైవరే ఇందులో సూత్రధారనే ఆరో పణలు వినిపిస్తున్నాయి. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం... స్టేషన్‌ఘన్‌పూర్ మండల పరిధిలోని నూ తన చిలుపూర్ మండలం రాజవరం గ్రామానికి చెందిన బట్టమేకల రామచంద్రం తనకు వారసత్వంగా వచ్చిన రెండు ఎకరాల భూమిని దశాబ్దాల కాలం నుంచి కాస్తుచేసుకుంటున్నాడు. పట్టాదారుఖానా(కాలమ్)లో తన పేరును చేర్చుకునేందుకు స్టేషన్‌ఘన్‌పూర్ తహసీల్దార్ సదానందంను రామచంద్రం కుమారుడు సాంబరాజు కలిశాడు. రాజవరం గ్రామ పరిధిలో సర్వేనెంబర్ 649లో 2ఎకరాలు భూమి రామచంద్రానికి వారసత్వంగా వస్తున్నది. ఆభూమిని తన పేర మా ర్చేందుకు అవకాశం ఉన్నట్లు తెలుసుకున్న రామచంద్రం కుమారుడు సాంబరాజు తహసీల్దార్ సదానందంను నేరుగా కలిసి తమవద్ద ఉన్న కాగితాలను చూపించాడు. అయితే వాటిని తన డ్రైవర్ నీల రా జుకు తహసీల్దార్ చూపించమన్నట్లు సాంబరాజు తెలిపాడు.
ఆ కాగితాలను పట్టుకుని డ్రైవర్ రాజును సాంబరాజు కలువగా రూ.35వేలు ఖర్చవుతుందని, ఇచ్చిన 15రోజుల్లో పట్టాదారుపాస్‌బుక్కులను అం దించనున్నట్లు తెలిపినట్లు తెలిపాడు. వెంటనే రూ.15 వేలను అందించగా, పాస్‌బుక్కులను చూపించాడని, అందులో ఆర్డీవో సంతకాలు లేవని ప్రశ్నించడంతో మిగిలిన డబ్బులు అందిస్తే సంతకాలు చేయించి ఇస్తానని తెలిపినట్లు వెల్లడించారు. ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను తీసుకుని వడ్డీ వ్యాపారి వద్ద కుదువబెట్టి డ్రైవర్ రాజుకు డబ్బులు ఇచ్చినట్లు సాంబరాజు చెబు తున్నాడు. ఈ తతంగమంతా కూడా ఆరునెలల సమయం పట్టిందని, పాస్‌పుస్తకాలను పట్టుకుని ఆం ధ్రాబ్యాంక్‌కు వెళ్లగా యూనిక్ నెంబర్ లేదని, వేయించుకుని వస్తేనే పంట రుణాలను అందిస్తామని బ్యాం కు అధికారులు చెప్పారని సాంబరాజు తెలిపాడు. ఇదే విషయాన్ని రాజుకు తెలుపగా అధికారులు ఉండడం లేదని, రేపుమాపు అంటూ కాలం సాగదీస్తూ వస్తుండగా నాలుగు రోజుల క్రితం రాజును నిలదీయడంతో అందరు అధికారులకు డబ్బులు ఇచినట్లు తేల్చి చెప్పాడని ఆయన పేర్కొన్నాడు. దీంతో నేరుగా స్థానిక తహసీల్దార్ సదానందంను కలిసి పాస్‌పుస్తకాల నకలు కాపీలను చూపించగా తన సంతకాలు కాదని, నకిలీవని తేల్చి చెప్పారని సాంబరాజు తెలిపాడు. కాగా, సాంబరాజు నుంచి ఆ పాస్‌పుస్తకాలను అధికారులు చేజిక్కించుకోవాలని ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది.
బట్టమేకల రామచంద్రంకు అందించిన పట్టాదారు పాస్‌పుస్తకం 6931 సీరియల్ నెంబర్ కాగా, పట్టానెంబర్ 1252 వేసి అతనికి అందించారు. తహసీల్దార్ సదానందం సంతకంతో పాటు వీఆర్‌ఓ, ఆర్డీఓ వెంకటమాధవరావు సంతకాన్ని ఫోర్జరీ చేసి పాస్‌పుస్తకాలను తయారు చేసి అందించారు. తహసీల్దార్‌తో నిత్యం కలివిడిగా తిరిగే డ్రైవర్‌తో పనులు అవుతాయని ఆశించిన తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాడని సాంబరాజు ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే డ్రైవర్ రాజు నాలుగైదు రోజులుగా విధులకు హాజరు కావడంలేదని, ఫోన్ స్విచ్చాఫ్ వస్తున్నట్లు తెలిసింది.

Comments
Post a Comment