మన ఉద్యోగాలు మనోళ్లకే!


దేశాల నుంచి ‘దిగుమతి’ వద్దేవద్దు
హెచ్‌-1బీలో అమెరికాలో చదివిన వాళ్లకు ప్రాధాన్యం
ఇమిగ్రేషన్‌ విధానాన్ని సంస్కరించాల్సిందే
త్వరలో కాంగ్రెస్‌లో చట్టం కోసం బిల్లు
వాషింగ్టన్‌, జనవరి 20: ‘‘ఎక్కడెక్కడి వాళ్లకో హెచ్‌-1బీ వీసాలు ఇవ్వడం ఎందుకు? మన దేశంలోని యూనివర్సిటీల్లో చదువుకున్న వారికే ప్రాధాన్యం ఇవ్వాలి! మన దేశీయులకే ఉద్యోగాలివ్వాలి’’ అంటూ అమెరికన్‌ కాంగ్రెస్ లోని ఇద్దరు బలమైన సెనెటర్లు ప్రతిపాదించారు. త్వరలో ఈ బిల్లును చట్టసభలో ప్రవేశ పెడతామని ప్రకటించారు. అదేగనుక చట్టంగా మారితే... భారతలోని ఐటీ సంస్థలకు, భారత ఐటీ నిపుణులకు గడ్డుకాలం తప్పదు. తాము ప్రతిపాదించిన చట్టం గురించి సెనెటర్లు చుక్‌ గ్రాస్‌లీ, డిక్‌ డర్బన్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.
 
వీరిలో గ్రాస్‌లీ సెనేట్‌ జ్యూడిషియరీ కమిటీ చైర్మన్‌ కావడం గమనార్హం. అమెరికాలో తాత్కాలికంగా పని చేసేందుకు జారీ చేసే హెచ్‌-1బీ వీసాలలో అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుకున్న విదేశీయులకే ప్రాధాన్యం ఇవ్వాలని వీరు పేర్కొన్నారు. ‘‘ఉన్నత డిగ్రీలు, మంచి నైపుణ్యం ఉన్న అమెరికన్లను ప్రోత్సహించేలా ప్రాధాన్య విధానాన్ని రూపొందించారు. కానీ, దురదృష్టవశాత్తూ కొన్ని కంపెనీలు అమెరికన్లకు ఉద్యోగాలివ్వకుండా, తక్కువ జీతానికి పని చేసే విదేశీయులను నియమించుకుంటున్నాయి.
 
అమెరికన్లకే తొలి ప్రాధాన్యమిచ్చే విధానాలు కావాలి’ అని చుక్‌ గ్రాస్లీ, డిక్‌ డర్బన్‌ పేర్కొన్నారు. విదేశీయులకు ఉద్యోగాలివ్వాల్సిన పరిస్థితే ఉంటే... అమెరికా కాలేజీలు, వర్సిటీల్లో చదువుకున్న వారికే ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. విదేశాల నుంచి ఉద్యోగులను ‘దిగుమతి’ చేసుకోరాదని అభిప్రాయపడ్డారు. వీసా ఉన్నవారితోపాటు అమెరికా నిపుణుల ప్రయోజనాలూ కాపాడేలా బిల్లు రూపొందించినట్లు సెనెటర్లు తెలిపారు. ఇందులో ఎల్‌-1 వీసా గురించి కూడా ప్రస్తావించారు. (మరో దేశంలో పని చేస్తున్న తమ ఉద్యోగిని అమెరికాలోని తమ సంస్థ కార్యాలయం, అనుబంధ సంస్థల్లో తాత్కాలికంగా నియమించే వారికి ఎల్‌-1 వీసా జారీ చేస్తారు.

Comments

Popular posts from this blog

రాక్షస గుహలు.. సొరంగ మార్గాలు.

ఎర్రబెల్లి కుటుంబసభ్యులకు సీఎం పరామర్శ

'కప్పిపుచ్చుకోవడానికే రిజర్వేషన్లు'