సెల్ఫీ యత్నమో.. ఆత్మహత్యో..?

సెల్ఫీ యత్నమో.. ఆత్మహత్యో..?
> 86వ అంతస్తు నుంచి పడ్డాడు!
AMR న్యూస్ తెలంగాణ/ఇంటర్నెట్‌డెస్క్‌: రష్యాలోని మాస్కోలో ఓ యువకుడు 86 అంతస్తుల భవనం పైనుంచి పడి మృతి చెందాడు. సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తూ జారి పడి మృతి చెందాడని కొందరు... తండ్రితో గొడవ కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడని మరికొందరు చెబుతున్నారు.
వివరాల్లోకి వెళితే... మాస్కోలో 86అంతస్తుల భవనం ఉంది. దీన్ని ఓకో టవర్‌ అని పిలుస్తుంటారు. దీని ఎత్తు సుమారు 1,162 అడుగులు. ఈ భవనంలో పలు వ్యాపార, వాణిజ్య సంస్థలు తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. స్థానికులు సేద తీరేందుకు పలు ఆటలు కూడా ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆదివారం 18ఏళ్ల యువకుడు అలెగ్జాండర్‌ ఓకో టవర్‌ పైనుంచి పార్కింగ్‌లో ఉన్న మెర్సిడెస్‌ జీ వాగన్‌ కారుపై పడి మృతి చెందాడు. అతడి మృతిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రష్యా వార్తాపత్రికల కథనం ప్రకారం తండ్రితో కలిసి స్కేటింగ్‌ చేసేందుకు ఓకో టవర్‌కి వచ్చాడు అలెగ్జాండర్‌. ఆ సమయంలో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో మనస్తాపానికి గురైన యువకుడు... భవనంపై ఉన్న హెలీప్యాడ్‌ నుంచి కిందకి దూకేశాడు. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సెల్ఫీ దిగేందుకు ప్రయత్నిస్తూ ప్రమాదవశాత్తూ జారిపడ్డాడని మరికొందరు చెబుతున్నారు. కారణం ఏదైనా ఓ నిండు ప్రాణం పోయింది.. తండ్రికి పుత్ర శోకం మిగిలింది.

Comments

Popular posts from this blog

రాక్షస గుహలు.. సొరంగ మార్గాలు.

ఎర్రబెల్లి కుటుంబసభ్యులకు సీఎం పరామర్శ

'కప్పిపుచ్చుకోవడానికే రిజర్వేషన్లు'