ముగిసిన సంక్రాంతి... కన్నీరవుతున్న పల్లెలు
AMR NEWS TELANGANA :
మూడు రోజుల సంక్రాంతి, జీవితకాలపు సంబరాలు, పాత కాలపు జ్ఞాపకాలు, చిన్ననాటి స్నేహితులు, వృద్దాప్యంలో ఉన్న తల్లి దండ్రులు, మనం పుట్టి, పెరిగి, తిరిగాడిన పల్లె సీమలు ఇదే మన సంక్రాంతి. పండుటాకుల లాంటి తల్లి దండ్రులు సంవత్సరం పొడుగునా బిడ్డల కోసం ఎదురు చూసిన సంక్రాంతి ఇలా వచ్చి అలా వెళ్లి పోయింది. సంవత్సరం పొడుగునా కిక్కిరిసే మహానగరాలు సైతం పల్లె బాట పట్టాయి సంక్రాంతి పేరుతో! నగరపు రోడ్డులు వెలవెల బోయాయి మూడు రోజుల పాటు పలకరించే నాదుడు లేక. ఈ మూడు రోజులు పల్లెకు ప్రాధాన్యత పెరిగింది. కోటీశ్వరుడు కూడా తను వేసుకున్న కోటును పక్కన పెట్టి, చిన్న పిల్లాడిగా మారిపోయాడంటే! నమ్మక తప్పదు. ఇదే అసలైన సంక్రాంతి. జీవితకాలపు జ్ఞాపకాలను మూడు రోజుల్లో మూటగట్టుకునే గొప్ప అవకాశం, వేదిక కూడా మన సంక్రాంతి. ఎలా గడిచిందో కూడా తెలియదు మూడు రోజుల పాటు అన్నిటినీ మరిచి అందరినీ ఆప్యాయంగా పలకరించి, మధురానుభూతులను మిగుల్చుకొని, మరో సంక్రాంతి ఎప్పుడొస్తుందా అని బరువెక్కిన హృదయంతో, చెమర్చిన కళ్లతో పల్లెకు వీడ్కోలు పలుకుతున్నారు ప్రతి ఒక్కరూ. సంపాదించిన కోట్లు, బిజీగా ఉన్న క్షణాలు, ట్రాఫిక్ తో నిండిన రోడ్లు, టెన్షన్ తో బతికిన రోజులు ఇవన్నీ మనల్ని మనం కోల్పోయేలా చేస్తాయి. మనకు తెలియకుండానే మన జీవితాన్ని ఆక్రమించేస్తాయి. మనల్ని మనం మర్చిపోయిన నాడు మనకెంతున్నా మనది కాదనేగా! కానీ సంక్రాంతి వీటన్నిటికీ విరుద్ధం. మనల్ని మనం మర్చిపోయిన క్షణాలను మనకు గుర్తుకు తెస్తాయి. మనం చదివిన చిన్న నాటి బడి, తిరిగిన పొలం గట్లు, పరిగెత్తిన ఇసుకతిన్నెలు, చప్పరించిన పిప్పరమెంట్లు ఇవేగా మధురమైన బాల్య స్మృతులు. మనకు మనం గుర్తొచ్చినట్లేగా?
ఇన్నాళ్లు పట్టణంలో ముఖస్తుతి కోసమో, అవసరార్ధమో పలకరించిన పలకరింపులకు, మన పల్లెల్లో సంక్రాంతి రోజుల్లో మన వాళ్లు పలకరించిన పలకరింపులకు ఎంత తేడానో కదా! ఓరి ఓరి ఓరి నువు పలానా వెంకట్రావు గారి అబ్బాయివా? బాగున్నావా? పిల్లలు బాగున్నారా? సూటు బూటులో ఎంత మారిపోయావు పాపం మీ నాన్న నిన్నిలా చూస్తే ఎంత మురిసిపోయేవాడో! అని ఓ తాత పలకరింపులో ఎంతో ఆత్మీయత కదూ! అక్కడి నుంచి కొంత దూరం వెళ్లే సరికి నడుము ఒంగి వణుకుతున్న గొంతుతో నిన్ను చూసి ఎవరు బాబూ అని పలకరిస్తే! నువు పలానా అని చెప్పేసరికి, మసక బారిన ఆమె కళ్లలో కనిపించే ఆనందం నీ ఫోటో ఫోర్బ్స్ మ్యాగ్జైన్ లో కవర్ ఫోటోగా నిన్ను నువ్వు చూసుకున్నా కనిపించదేమో! ఇదేనండి మన పల్లెటూరి ప్రేమలు ఆప్యాయతలు, సంక్రాంతి ముచ్చట్లు మనం పల్లెల్లో వదిలెళ్లిన మూలాలు. మనం చీముడు ముక్కుతో ఉన్నప్పుడూ మనల్ని ఆదరించింది పల్లె! మన కాళ్లకు చెప్పుల్లేనప్పుడూ మనల్ని ఆదరించింది పల్లె! గుడ్డ సంచిలో పుస్తకాలతో బడికెల్లినప్పుడు నా బిడ్డలొస్తున్నారు, వాళ్ల కాళ్లకు చెప్పులు లేవు ముల్లు గుచ్చుకుంటాయి మీరు గట్టిలా మారి నా బిడ్డల కోసం తివాచి పరచిన పొలం గట్లను ఎన్ని సార్లు వేడుకుందో ఈ పల్లె! తాను బాగున్నంత వరకూ అందర్నీ ఆదరించింది తన వైభవాన్ని కోల్పోయిన నాడు కన్నీటితో సాగనంపింది పట్టణంలో పోరాటం చెయ్యమని. బతుకు తెరువుకోసం మీరు పడుతున్న పాట్లు నేను చూడలేనని పల్లె పల్లెలోనే ఉండిపోయింది. పల్లెగానే మిగిలి పోయింది. అలా వెళ్లిన తమ బిడ్డలు సంక్రాంతి నాడు ప్రయోజకులుగా తనను వెతుక్కుంటూ వచ్చేసరికి మురిసి పోయింది పల్లె! మంచులో తడిచిన మందారంలా మారి పోయింది పల్లె! మళ్లీ సంక్రాంతి ముగించుకొని తనను వీడి పట్టణాలకు వెళ్తున్న బిడ్డలను చూసి లోపల బాధపడుతున్నా పైకి నవ్వు నటిస్తోంది పల్లె కన్నీళ్లు లేక ఇంకి పోయిన కళ్లతో లోలోపల వెక్కిల్లు వస్తున్నా కూడా నవ్వు నటించడం పల్లెకే సాధ్యం వెళ్లి రండి క్షేమంగా మరో సంక్రాంతికి ఇక్కడే కలుసుకుందాం, అని పట్టణాలకు బయలు దేరిన తన పిల్లలకు టాటా చెప్తోంది పల్లె తల్లి.....

Comments
Post a Comment