మనోళ్లు పనికిరారా?: కోదండరాం

కాంట్రాక్టులన్నీ ఆంధ్రోళ్లకేనా? హైదరాబాద్: ‘‘హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ పంపిణీ చేసిన చెత్తడబ్బాల కాం ట్రాక్టు ఆంధ్రా వాళ్లకే.. మన ఊరిలో చెరువులు బాగు చేయించే పనులు వాళ్లకే.. చెత్త డబ్బా లను తయారు చేయడానికి, ఊళ్లో చెరువుల్లో మట్టి ఎత్తిపోయడానికి కూడా మన వాళ్లు పనికిరారా..?’’ అని టీజేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం ప్రశ్నించారు. మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్టుల కాంట్రాక్టులు తెలంగాణ వారికి ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. మిషన్ భగీరథ పైపులు ఎక్కడ తయారవు తున్నాయో, ఎక్కడ్నుంచి వస్తున్నయో తెలియడం లేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారులపైకి కట్టె పట్టుకుని మీదకు ఉరికి వచ్చిన వాళ్లే పదవుల్లో ముందున్నారని వ్యాఖ్యానించారు. ఆదివారమిక్కడ తెలంగాణ విద్యావంతుల వేదిక(టీవీవీ) రూపొందించిన డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో కోదండరాం మాట్లాడారు. ప్రత్యేక తెలంగాణకు అడ్డంపడి, ఉద్యమకారులపై దాడులు చేసిన శక్తులే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో అధిపత్యం చెలాయిస్తున్నాయన్నారు. ప్రస్తుతం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు, ఉద్యమ వ్యతిరేకులకు మధ్య ఘర్షణ జరుగుతోందన్నారు. ప్రజల ఆకాంక్షలు నెరవేరడంలేదని పేర్కొన్నారు. సోలార్...