మిషన్ కాకతీయతో పల్లె పరిపుష్టి ఈ పథకంతో తెలంగాణ ప్రజలకు జాతీయస్థాయిలో గౌరవం అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి హరీశ్‌రావు
మిషన్ కాకతీయతో పల్లె పరిపుష్టి
ఈ పథకంతో తెలంగాణ ప్రజలకు జాతీయస్థాయిలో గౌరవం
అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్: మిషన్ కాకతీయ మూడో దశ పనులు బాగా జరుగుతున్నాయని, చెరువులకు పూర్వవైభవం తీసుకొచ్చే ఈ పథకం గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతానికి దోహదం చేస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. గతంలో ఏ సంవత్సరం కూడా చెరువుల కింద 10.70 లక్షల ఎకరాలకు మించి సాగయ్యేది కాదని, పూడికతీత పనులతో పాటు తమ ప్రభుత్వం తొమ్మిది గంటల విద్యుత్తు సరఫరా చేస్తుండడంతో 15 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చిందన్నారు. ఈ సంవత్సరం అది 20 లక్షల ఎకరాలకు చేరిందన్నారు. బుధవారమిక్కడ ‘మిషన్ కాకతీయ మీడియా అవార్డుల ప్రదానం-2016’ కార్యక్రమం జరిగింది. వివిధ విభాగాల్లో పాత్రికేయులకు మంత్రి అవార్డులను అందజేశారు. ఈటీవీ విలేకరి మణికేశ్వర్(ఆదిలాబాద్) రెండో బహుమతి, ముద్రణ విభాగంలో ఈనాడు విలేకరి(పెద్దపల్లి) బి.రాజేందర్ ప్రత్యేకజ్యూరీ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రజల బాధల్ని తీర్చడంతో పాటు భవిష్యత్ తరాలకు చెరువుల్ని వారసత్వంగా అందించాలన్న ఆలోచనతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ‘మిషన్ కాకతీయ’ను చేపట్టారన్నారు. మిషన్ కాకతీయ పనులతో తెలంగాణ ప్రజలకు జాతీయస్థాయిలో గౌరవం పెరిగిందన్నారు.

ప్రతి వరి గింజను కొనుగోలు చేస్తాం: హరీశ్
మెదక్,
: రబీలో రాష్ట్రంలో 60 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ఆశిస్తున్నామని, ప్రతి వరి గింజను కొంటామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మెదక్ జిల్లా ఫరీద్‌పూర్‌లో ఆయన రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ధాన్యం కొనుగోలు నేపథ్యంలో ప్రతి జిల్లాలో కంట్రోల్‌రూం ఏర్పాటుచేయాలని కలెక్టర్లను ఆదేశించామన్నారు.మెదక్,
Comments
Post a Comment