సబ్బండ వర్గాల ఆశాజ్యోతి సీఎం కేసీఆర్ - జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి.

సబ్బండ వర్గాల ఆశాజ్యోతి సీఎం కేసీఆర్ - జిల్లా పరిషత్ ఛైర్మెన్ పద్మ,జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి.
> మిషన్ కాకతీయ చెరువులకు శంకుస్థాపన చేసిన జిల్లా పరిషత్ ఛైర్మెన్ పద్మ, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
> కూలి పని చేసి 30 వేళా రూపాయల సంపాదన.
జనగామ జిల్లా /నర్మెట్ట:
సబ్బండ వర్గాల ఆశాజ్యోతి సీఎం కేసీఆర్ అని జిల్లా పరిషత్ ఛైర్మెన్ పద్మ,జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా మండలకేంద్రంలోని ఆమేడపు కుంట 14 లక్షల వ్యయంతో,ధారువయి కుంట 7.84 లక్షల తో మిషన్ కాకతీయ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మండలకేంద్రంలోని కొత్తగా నిర్మిస్తున్న ఎన్సీసీ కాంట్రాక్టర్ ఇంటి నిర్మాణ గోడకు నీళ్లు పట్టి 10 వేళా రూపాయలు అందజెయ్యగా, ఇండెన్సి గ్యాస్ వద్ద గ్యాస్ సిలిండర్లను మోసి 20 వేళా రూపాయలు కూలి పని నిమిత్తం తీసుకున్నారు. ఈ సందర్బంగా వా

రు మాట్లాడుతూ.. రైతు బంధువుడు సీఎం కె.సి.ఆర్ అని, రాయితీలు ఖరీఫ్, రబీ సీజన్ లలో పండించే పంటకు ఎరువుల నిమిత్తం ఎకరాకు 4 వేల రూపాయలు అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో  పి.ఎ.సి.ఎస్ ఛైర్మెన్ ఇమ్మడి శ్రీనివాస్ రెడ్డి,పి.ఎ.సి.ఎస్ వైస్ ఛైర్మెన్ పెద్ది రాజి రెడ్డి, టి.ఆర్.ఎస్ మండల అధ్యక్షుడు ఎండి గౌస్ తదితరులు పాల్గొన్నారు .

Comments

Popular posts from this blog

రాక్షస గుహలు.. సొరంగ మార్గాలు.

ఎర్రబెల్లి కుటుంబసభ్యులకు సీఎం పరామర్శ

'కప్పిపుచ్చుకోవడానికే రిజర్వేషన్లు'