ఇచ్చిన హామీ మేరకే రిజర్వేషన్ల పెంపు

ఇచ్చిన హామీ మేరకే రిజర్వేషన్ల పెంపు 

హైదరాబాద్‌: రిజర్వేషన్ల పెంపు నిర్ణయం ఇప్పటిది కాదని.... గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానం మేరకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. రిజర్వేషన్ల బిల్లు సభలో ప్రవేశపెట్టడం చరిత్రాత్మకమైనదని అన్నారు. ముస్లింలు, గిరిజనుల రిజర్వేషన్ల పెంపు బిల్లును ఈరోజు ఆయన శాసనసభలో ప్రవేశపెట్టారు.
ప్రస్తుత రిజర్వేషన్ల పెంపు వల్ల బీసీలకు ఎలాంటి నష్టం వాటిల్లదని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరాల్సిన భాధ్యత తమపై ఉందన్నారు. గిరిజనులు, బీసీ-2 వర్గాలకు రిజర్వేషన్లు కొత్త అంశమేమీ కాదన్నారు. సామాజిక, ఆర్థిక వెనుకబాటు వల్లే రిజర్వేషన్లు పెంచుతున్నట్లు తెలిపారు.

Comments

Popular posts from this blog

రాక్షస గుహలు.. సొరంగ మార్గాలు.

ఎర్రబెల్లి కుటుంబసభ్యులకు సీఎం పరామర్శ

'కప్పిపుచ్చుకోవడానికే రిజర్వేషన్లు'