తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఈరోజు ఉదయం 10 గంటలకు విడుదలయ్యాయి. ఇంటర్‌బోర్డు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు. మార్చి నెలలో జరిగిన ఇంటర్‌ పరీక్షలను 9.76లక్షల మంది విద్యార్థులు రాశారు.
ఫస్ట్‌ ఇయర్‌లో 4,75,874మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 2,70,738మంది ఉత్తీర్ణులయ్యారు. పాస్‌ శాతం 57. గతేడాది కంటే ఇది 6శాతం ఎక్కువ. అలాగే రెండో సంవత్సరంలో 4,14,213 మంది పరీక్ష రాయగా.. 2,75,273 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 66.45. గతేడాది కంటే ఇది మూడు శాతం ఎక్కువ. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాలు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. 

Comments

Popular posts from this blog

రాక్షస గుహలు.. సొరంగ మార్గాలు.

ఎర్రబెల్లి కుటుంబసభ్యులకు సీఎం పరామర్శ

'కప్పిపుచ్చుకోవడానికే రిజర్వేషన్లు'