వరంగల్‌ సభ ‘తెలంగాణ ప్రగతి నివేదన’ ప్రగతి ప్రాంగణంగా హైదరాబాద్‌ ప్లీనరీ పేర్లను ఖరారు చేసిన కేసీఆర్‌

వరంగల్‌ సభ ‘తెలంగాణ ప్రగతి నివేదన’ 
ప్రగతి ప్రాంగణంగా హైదరాబాద్‌ ప్లీనరీ 
పేర్లను ఖరారు చేసిన కేసీఆర్‌ 
AMRNEWS/TELANGANA- STATE DESK :

హైదరాబాద్‌: ఈ నెల 27న తెలంగాణ ఆవిర్భావదినం సందర్భంగా వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో తెరాస నిర్వహించే భారీ బహిరంగ సభకు ‘తెలంగాణ ప్రగతి నివేదన’ పేరును పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ ఖరారు చేశారు. ఈ నెల 21న హైదరాబాద్‌ కొంపల్లిలో జరిగే తెరాస ప్లీనరీ స్థలాన్ని ‘తెలంగాణ ప్రగతి ప్రాంగణం’గా పిలవాలని నిర్ణయించారు. ఇటు ప్లీనరీ, అటు బహిరంగసభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడానికి తెరాస సన్నాహాలు చేస్తోంది. వరంగల్‌ సభకు గర్జన పదం సూచించేలా పేర్లు ఉండాలని స్థానిక నేతలు సీఎంను కోరారు. ఇందుకు ఆయన అంగీకరించలేదు. ఉద్యమ సమయంలో అలాంటి పేర్లు ఉండాలని, ఇప్పుడు తెరాస అధికారంలో ఉందని, మూడేళ్లుగా పెద్దఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టినందున... ప్రగతిని సూచించేలా పేర్లు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై పార్టీ నేతలు, ప్రముఖులతో విస్తృతంగా మంతనాలు జరిపి చివరికి ప్రగతి నివేదన పేరును ఖరారు చేశారు. ప్లీనరీ సైతం ప్రగతిని ప్రతిబింబించేలా.. ‘ప్రగతి ప్రాంగణం’ పేరుతో ఉండాలని ఆదేశించారు. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖల మంత్రి కేటీఆర్‌ బుధవారం అధికారికంగా వీటిని వెల్లడించారు.

Comments

Popular posts from this blog

రాక్షస గుహలు.. సొరంగ మార్గాలు.

ఎర్రబెల్లి కుటుంబసభ్యులకు సీఎం పరామర్శ

'కప్పిపుచ్చుకోవడానికే రిజర్వేషన్లు'