ఇక డీలరు వద్దే వాహన రిజిస్ట్రేషన్‌ నంబరు ప్లేటు అమర్చాకే రోడ్డు పైకి ఈ ఏడాది చివరి నుంచి అమలుకు కేంద్రం యోచన

ఇక డీలరు వద్దే వాహన రిజిస్ట్రేషన్‌
నంబరు ప్లేటు అమర్చాకే రోడ్డు పైకి
ఈ ఏడాది చివరి నుంచి అమలుకు కేంద్రం యోచన
ఈనాడు, హైదరాబాద్‌: కొత్త వాహనాలను ఇకపై రవాణాశాఖ కార్యాలయానికి తీసుకురావాల్సిన అవసరం ఉండదు. తనిఖీలకని, సంఖ్యా ఫలకం (నంబరు ప్లేటు) కోసమని కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పనిలేదు. శాశ్వత నంబరు ప్లేటు బిగింపు సహా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియనంతటినీ వాహన విక్రేతల వద్దే పూర్తిచేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ ఏడాది చివరి నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. నూతన మోటారు వాహన చట్టం ఇటీవల లోక్‌సభ ఆమోదం పొందింది. రాజ్యసభ అంగీకారం అనంతరం ఇది కార్యరూపంలోకి రానుంది. అవినీతి నియంత్రణలో భాగంగా... వ్యక్తిగత వాహనాలతో రవాణాశాఖకు సంబంధం లేకుండా చేయాలన్నది ప్రభుత్వ వ్యూహం. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు గతేడాది నుంచే డీలర్ల వద్ద వాహనాలను రిజిస్ట్రేషన్‌ చేయిస్తున్నాయి. కానీ, తనిఖీ కోసం వాహనదారులు రవాణాశాఖకు వెళ్లాల్సి వస్తోంది. మోటారువాహన తనిఖీ అధికారి ఆమోదించాకే నంబరును కేటాయిస్తున్నారు. ఇకపై డీలరు వద్దే నంబరును ఇచ్చేస్తారు. ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపును మాత్రం యథాతథంగా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Comments

Popular posts from this blog

రాక్షస గుహలు.. సొరంగ మార్గాలు.

ఎర్రబెల్లి కుటుంబసభ్యులకు సీఎం పరామర్శ

'కప్పిపుచ్చుకోవడానికే రిజర్వేషన్లు'