మతపరమైన రిజర్వేషన్లు అడ్డుకుంటాం

మతపరమైన రిజర్వేషన్లు అడ్డుకుంటాం
హైదరాబాద్‌: తెలంగాణలో మతపరమైన రిజర్వేషన్లు కల్పించడాన్ని నిరసిస్తూ భాజపా ఎమ్మెల్యేలు ఈరోజు ఉదయం తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ వద్ద గల అంబేడ్కర్‌ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర నిర్వహించారు. నల్లకండువాలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌వీఎస్‌ ప్రభాకర్‌, ఎమ్మెల్సీ రామచంద్రరావు పాదయాత్రలో పాల్గొన్నారు. అంబేడ్కర్‌ స్ఫూర్తితో మతపరమైన రిజర్వేషన్లు సభలో అడ్డుకుంటామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏకపక్ష నిర్ణయాలతో సభను ఆదివారం నిర్వహిస్తున్నారని లక్ష్మణ్‌ ఆరోపించారు.

Comments

Popular posts from this blog

రాక్షస గుహలు.. సొరంగ మార్గాలు.

ఎర్రబెల్లి కుటుంబసభ్యులకు సీఎం పరామర్శ

'కప్పిపుచ్చుకోవడానికే రిజర్వేషన్లు'