బాహుబలి-2 టిక్కెట్ల కోసం బారులు
బాహుబలి-2 టిక్కెట్ల కోసం బారులు
హైదరాబాద్: వెండితెర అద్భుత కావ్యం బాహుబలి-2 చిత్రం చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనెల 2
8న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఐమ్యాక్స్‌లో నేటి నుంచి టిక్కెట్లు అమ్ముతున్నారు. టిక్కెట్లు దక్కించుకునేందుకు తెల్లవారుజామునుంచే అభిమానులు ఐమ్యాక్స్ వద్ద బారులు తీరారు. మండుటెండలో గంటల తరబడి క్యూలైన్లల్లో వేచి ఉండి టిక్కెట్లు దక్కించుకుంటున్నారు. టిక్కెట్లు దక్కిన వారు తాము పడ్డ కషాన్ని మర్చిపోయి ఆనందంతో ఇంటిబాట పడుతున్నారు. బాహుబలి చిత్రం సూపర్ హిట్ అవుతుందని.. సినిమా చూసేందుకు తామంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని చెబుతున్నారు.
Comments
Post a Comment