Posts

Showing posts from April, 2017

ఏ లుచ్ఛాలు, లఫంగులు ఇప్పుడు పాలిస్తున్నారు?

Image
ఏ లుచ్ఛాలు, లఫంగులు ఇప్పుడు పాలిస్తున్నారు? ఏ లుచ్ఛాల పరిపాలలో తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతోంది? ఏ లఫంగులు తెలంగాణను పరిపాలిస్తున్నారు? అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ పాలనలో మిర్చి రైతుకు లాఠీ ఛార్జీలు, పసుపు రైతుకు ఆత్మహత్యలే మిగిలాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ప్రతిపక్ష నేతలను తిట్టడానికి మాత్రమే ముఖ్యమంత్రి పరిమితమయ్యారని... ప్రజలకు, రైతులకు మేలు చేయడం ఆయనకు చేత కాదని విమర్శించారు. తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ నేతలను తరిమి కొట్టడానికి సిద్ధమవుతున్నారని చెప్పారు. రెండు లక్షల బస్తాల మిర్చి ఖమ్మం మార్కెట్ యార్డులో ఉంటే ముఖ్యమంత్రి కనీసం స్పందించరా? అంటూ ఉత్తమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ శాసనసభలో ముందు రైతుల పంటకు మద్దతు ధర గురించి మాట్లాడిన తర్వాతే... భూసేకరణ బిల్లుపై ముందుకు వెళ్లాలని చెప్పారు. Dailyhunt

బాహుబలి-2 టిక్కెట్ల కోసం బారులు

Image
బాహుబలి-2 టిక్కెట్ల కోసం బారులు హైదరాబాద్‌: వెండితెర అద్భుత కావ్యం బాహుబలి-2 చిత్రం చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనెల 2 8న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఐమ్యాక్స్‌లో నేటి నుంచి టిక్కెట్లు అమ్ముతున్నారు. టిక్కెట్లు దక్కించుకునేందుకు తెల్లవారుజామునుంచే అభిమానులు ఐమ్యాక్స్‌ వద్ద బారులు తీరారు. మండుటెండలో గంటల తరబడి క్యూలైన్లల్లో వేచి ఉండి టిక్కెట్లు దక్కించుకుంటున్నారు. టిక్కెట్లు దక్కిన వారు తాము పడ్డ కషాన్ని మర్చిపోయి ఆనందంతో ఇంటిబాట పడుతున్నారు. బాహుబలి చిత్రం సూపర్‌ హిట్‌ అవుతుందని.. సినిమా చూసేందుకు తామంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని చెబుతున్నారు.

సబ్బండ వర్గాల ఆశాజ్యోతి సీఎం కేసీఆర్ - జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి.

Image
సబ్బండ వర్గాల ఆశాజ్యోతి సీఎం కేసీఆర్ - జిల్లా పరిషత్ ఛైర్మెన్ పద్మ,జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. > మిషన్ కాకతీయ చెరువులకు శంకుస్థాపన చేసిన జిల్లా పరిషత్ ఛైర్మెన్ పద్మ, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి > కూలి పని చేసి 30 వేళా రూపాయల సంపాదన. జనగామ జిల్లా /నర్మెట్ట: సబ్బండ వర్గాల ఆశాజ్యోతి సీఎం కేసీఆర్ అని జిల్లా పరిషత్ ఛైర్మెన్ పద్మ,జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా మండలకేంద్రంలోని ఆమేడపు కుంట 14 లక్షల వ్యయంతో,ధారువయి కుంట 7.84 లక్షల తో మిషన్ కాకతీయ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మండలకేంద్రంలోని కొత్తగా నిర్మిస్తున్న ఎన్సీసీ కాంట్రాక్టర్ ఇంటి నిర్మాణ గోడకు నీళ్లు పట్టి 10 వేళా రూపాయలు అందజెయ్యగా, ఇండెన్సి గ్యాస్ వద్ద గ్యాస్ సిలిండర్లను మోసి 20 వేళా రూపాయలు కూలి పని నిమిత్తం తీసుకున్నారు. ఈ సందర్బంగా వా రు మాట్లాడుతూ.. రైతు బంధువుడు సీఎం కె.సి.ఆర్ అని, రాయితీలు ఖరీఫ్, రబీ సీజన్ లలో పండించే పంటకు ఎరువుల నిమిత్తం ఎకరాకు 4 వేల రూపాయలు అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో  పి.ఎ.సి.ఎస్ ఛైర్మెన్ ఇమ్మడి శ్రీనివాస్ రెడ్డి,పి.ఎ.సి.ఎ...

ప్రజల రక్షణ అందరి బాధ్యత ● ఎస్సై ఇమ్మడి వీరభద్రరావు.

Image
ప్రజల రక్షణ అందరి బాధ్యత ● ఎస్సై ఇమ్మడి వీరభద్రరావు. AMRNEWS TELANGANA/జనగామ ప్రతినిధి(నర్మెట్ట),ఏప్రిల్23 ప్రజల రక్షణ అందరి బాధ్యత అని నర్మెట్ట ఎస్సై ఇమ్మడి వీరభద్రరావు అన్నారు. ఆయన ఆదివారం రోజున ఆటో,జీపు డ్రైవర్ లకు రోడ్డు భద్రత ప్రమానాలపై అవగహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఎస్సై ఇమ్మడి వీరభద్రరావు మాట్లాడుతూ నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు డ్రైవర్ల తప్పిదాల వళ్లనే జరుగుతున్నాయని, జనగామ జిల్లాలోనే రోడ్డు ప్రమాధాల బారిన పడిన వారి శాతం ఎక్కువగా ఉందని అన్నారు. ఆటోలు,జీపులు కలవారు నిర్ధేశించిన సీట్ల పరిమితి ప్రకారమే పాసింజర్లను ఆటోలో ఎక్కించుకోవలని, ప్యాసింజర్లను ఎక్కువగా ఎక్కిచుకోవడం వల్లనే తరుచు ప్రమాధాలు జరుగుతున్నాయని అన్నారు. ఆటోలు,జీపులకు తప్పని సరిగా ఇన్సూరెన్స్,రోడ్ టాక్స్,పర్మిట్,పొల్యూషన్ కాగితాలు వుంటాలని,డ్రైవర్ తప్పని సరిగా డ్రెస్ కోడ్ ధరించి,లైసెన్స్ కలిగి ఉండాలని అన్నారు.

12 ఏళ్లలో 11 ప్రవేశ పరీక్షల పేపర్లు లీక్‌

Image
12 ఏళ్లలో 11 ప్రవేశ పరీక్షల పేపర్లు లీక్‌ హైదరాబాద్‌: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎంసెట్‌-2(2016) మెడికల్‌ ప్రవేశ పరీక్ష పత్రం లీకేజీ సూత్రధారి శివ్‌బహదూర్‌సింగ్‌ (ఎస్‌బీ సింగ్‌) ఆ వ్యవహారాల్లో ఆరితేరినట్లు వెల్లడైంది.12ఏళ్ల వ్యవధిలోనే దాదాపు 11 ప్రవేశపరీక్షల పేపర్లు బయటకు తీసుకువచ్చి సొమ్ముచేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఎనిమిది రాష్ట్రాల్లో కీలకంగా భావించే పరీక్షలతో పాటు కేంద్రప్రభుత్వ రంగ సంస్థ కోల్‌ఇండియా పరీక్ష కేసులోనూ భాగస్వామ్యం ఉన్నట్లు సీఐడీ వెల్లడించింది. స్థిరాస్తి వ్యాపారం(ప్రాపర్టీ డీలర్‌)చేసే ఆయన మరింత ఆదాయం కోసం లీకేజీ బాట పట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఎంసెట్‌ లీకేజీ కేసులో కీలక నిందితుడైన ఎస్‌బీ సింగ్‌ను, అతని సహాయకుడు అనూప్‌ కుమార్‌ సింగ్‌ (సోని)ను తెలంగాణ సీఐడీ పోలీసులు ఉత్తర్‌ప్రదేశ్‌లోని జాన్‌పూర్‌లో అరెస్టు చేశారు. వీరిద్దరినీ వారెంటు కింద బుధవారం హైదరాబాద్‌ తీసుకువచ్చారు. శివ్‌బహదూర్‌సింగ్‌ ఎంసెట్‌ లీకేజీలో ప్రధాన సూత్రధారి అని తెలంగాణ సీఐడీ అదనపు డీజీపీ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంసెట్‌2 మెడికల్‌ ప్రశ్నపత్రాన్ని తనకు ఉన్న పరిచయాల ద్వారా బయ...

గిట్టుబాటు ధర కోసం మిర్చి రైతుల ఆందోళన

Image
గిట్టుబాటు ధర కోసం మిర్చి రైతుల ఆందోళన   హైదరాబాద్‌ : మిర్చికి గిట్టుబాటు ధర కల్పించాలని బుధవారం హైదరాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌ ప్రధాన ద్వారం ఎదురుగా రహదారిపై మిర్చిని తగులబెట్టి రైతులు బైఠాయించారు. కొంతసేపు ట్రాఫిక్‌ జాం అయింది. చాదర్‌ఘాట్‌ పోలీసులు రైతులకు నచ్చజెప్పి మార్కెట్‌ కార్యాలయానికి పిలిపించగా, వ్యాపారులు, కమీషన్‌ ఏజెంట్లు, తెలంగాణ చాంబర్‌ ఆఫ్‌ అగ్రి ట్రేడర్స్‌ అధ్యక్షుడు బట్కరి విద్యానంద్‌ తదితరుల సమక్షంలో చర్చలు జరిపారు. న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. రాఘవేందర్‌, విద్యానంద్‌, శ్రీనివాస్‌ తదితరులు మాట్లాడుతూ మార్కెట్‌కు మిర్చి అధికంగా రావడం వల్ల లారీల కొరత ఏర్పడిందని, తీవ్రమైన ఎండల వల్ల హమాలీలు సరిగా రావడం లేదన్నారు. మిర్చి చివరి కోత వల్ల నాణ్యత లేకపోవడంతో ధర తగ్గిందన్నారు. మద్దతు ధర రూ.6 వేలు కల్పించాలి:  క్వింటాకు రూ. 2వేల లోపు కొనుగోళ్లు చేసుకుంటామని, ఇష్టమైతే అమ్మండి లేకపోతే లేదంటూ వ్యాపారులు తెగేసి చెబుతున్నారని రైతులు వాపోతున్నారు. క్వింటాకు రూ.ఆరు వేల ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఏపీ ప్రభుత్వం మిర్చి రైతులను క్వింటాకు రూ.1500...

వరంగల్‌ సభ ‘తెలంగాణ ప్రగతి నివేదన’ ప్రగతి ప్రాంగణంగా హైదరాబాద్‌ ప్లీనరీ పేర్లను ఖరారు చేసిన కేసీఆర్‌

Image
వరంగల్‌ సభ ‘తెలంగాణ ప్రగతి నివేదన’   ప్రగతి ప్రాంగణంగా హైదరాబాద్‌ ప్లీనరీ   పేర్లను ఖరారు చేసిన కేసీఆర్‌   AMRNEWS/TELANGANA- STATE DESK : హైదరాబాద్‌: ఈ నెల 27న తెలంగాణ ఆవిర్భావదినం సందర్భంగా వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో తెరాస నిర్వహించే భారీ బహిరంగ సభకు ‘తెలంగాణ ప్రగతి నివేదన’ పేరును పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ ఖరారు చేశారు. ఈ నెల 21న హైదరాబాద్‌ కొంపల్లిలో జరిగే తెరాస ప్లీనరీ స్థలాన్ని ‘తెలంగాణ ప్రగతి ప్రాంగణం’గా పిలవాలని నిర్ణయించారు. ఇటు ప్లీనరీ, అటు బహిరంగసభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించడానికి తెరాస సన్నాహాలు చేస్తోంది. వరంగల్‌ సభకు గర్జన పదం సూచించేలా పేర్లు ఉండాలని స్థానిక నేతలు సీఎంను కోరారు. ఇందుకు ఆయన అంగీకరించలేదు. ఉద్యమ సమయంలో అలాంటి పేర్లు ఉండాలని, ఇప్పుడు తెరాస అధికారంలో ఉందని, మూడేళ్లుగా పెద్దఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టినందున... ప్రగతిని సూచించేలా పేర్లు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై పార్టీ నేతలు, ప్రముఖులతో విస్తృతంగా మంతనాలు జరిపి చివరికి ప్రగతి నివేదన పేరును ఖరారు చేశారు. ప్లీనరీ సైతం ప్రగతిని ప్రతిబింబించేలా.. ‘ప్రగతి ప్రా...

ఇక డీలరు వద్దే వాహన రిజిస్ట్రేషన్‌ నంబరు ప్లేటు అమర్చాకే రోడ్డు పైకి ఈ ఏడాది చివరి నుంచి అమలుకు కేంద్రం యోచన

Image
ఇక డీలరు వద్దే వాహన రిజిస్ట్రేషన్‌ నంబరు ప్లేటు అమర్చాకే రోడ్డు పైకి ఈ ఏడాది చివరి నుంచి అమలుకు కేంద్రం యోచన ఈనాడు, హైదరాబాద్‌: కొత్త వాహనాలను ఇకపై రవాణాశాఖ కార్యాలయానికి తీసుకురావాల్సిన అవసరం ఉండదు. తనిఖీలకని, సంఖ్యా ఫలకం (నంబరు ప్లేటు) కోసమని కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పనిలేదు. శాశ్వత నంబరు ప్లేటు బిగింపు సహా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియనంతటినీ వాహన విక్రేతల వద్దే పూర్తిచేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ ఏడాది చివరి నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. నూతన మోటారు వాహన చట్టం ఇటీవల లోక్‌సభ ఆమోదం పొందింది. రాజ్యసభ అంగీకారం అనంతరం ఇది కార్యరూపంలోకి రానుంది. అవినీతి నియంత్రణలో భాగంగా... వ్యక్తిగత వాహనాలతో రవాణాశాఖకు సంబంధం లేకుండా చేయాలన్నది ప్రభుత్వ వ్యూహం. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు గతేడాది నుంచే డీలర్ల వద్ద వాహనాలను రిజిస్ట్రేషన్‌ చేయిస్తున్నాయి. కానీ, తనిఖీ కోసం వాహనదారులు రవాణాశాఖకు వెళ్లాల్సి వస్తోంది. మోటారువాహన తనిఖీ అధికారి ఆమోదించాకే నంబరును కేటాయిస్తున్నారు. ఇకపై డీలరు వద్దే నంబరును ఇచ్చేస్తారు. ఫ్యాన్సీ నంబర్ల కేటాయింపును మాత్రం యథాతథంగా కొనసాగించాలని ప్...

మిషన్‌ కాకతీయతో పల్లె పరిపుష్టి ఈ పథకంతో తెలంగాణ ప్రజలకు జాతీయస్థాయిలో గౌరవం అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి హరీశ్‌రావు

Image
మిషన్‌ కాకతీయతో పల్లె పరిపుష్టి   ఈ పథకంతో తెలంగాణ ప్రజలకు జాతీయస్థాయిలో గౌరవం   అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి హరీశ్‌రావు   హైదరాబాద్‌: మిషన్‌ కాకతీయ మూడో దశ పనులు బాగా జరుగుతున్నాయని, చెరువులకు పూర్వవైభవం తీసుకొచ్చే ఈ పథకం గ్రామీణ ఆర్థికవ్యవస్థ బలోపేతానికి దోహదం చేస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. గతంలో ఏ సంవత్సరం కూడా చెరువుల కింద 10.70 లక్షల ఎకరాలకు మించి సాగయ్యేది కాదని, పూడికతీత పనులతో పాటు తమ ప్రభుత్వం తొమ్మిది గంటల విద్యుత్తు సరఫరా చేస్తుండడంతో 15 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చిందన్నారు. ఈ సంవత్సరం అది 20 లక్షల ఎకరాలకు చేరిందన్నారు. బుధవారమిక్కడ ‘మిషన్‌ కాకతీయ మీడియా అవార్డుల ప్రదానం-2016’ కార్యక్రమం జరిగింది. వివిధ విభాగాల్లో పాత్రికేయులకు మంత్రి అవార్డులను అందజేశారు. ఈటీవీ విలేకరి మణికేశ్వర్‌(ఆదిలాబాద్‌) రెండో బహుమతి, ముద్రణ విభాగంలో ఈనాడు విలేకరి(పెద్దపల్లి) బి.రాజేందర్‌ ప్రత్యేకజ్యూరీ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ప్రజల బాధల్ని తీర్చడంతో పాటు భవిష్యత్‌ తరాలకు చెరువుల్ని వారసత్వంగా అందించాలన్న ఆలోచనతోనే ముఖ్యమంత్రి...

అధికార దర్పానికి ఎర్రలైటు!

Image
అధికార దర్పానికి ఎర్రలైటు!   ‘రా జు వెడలె రవితేజములలరగ’ అనిపించుకోవాలన్న యావ లావైన రాజకీయ నేతలు, అధికార గణాల ఉరవడి దేశ ప్రజాస్వామ్య వ్యవస్థనే పరిహాస భాజనం చేస్తోంది. ఏటికేడు జడలు విరబోసుకొంటున్న వీఐపీ సంస్కృతి వికృతత్వం- ఎక్కడికక్కడ జోరెత్తుతున్న బుగ్గకార్ల సంఖ్యావివరాల్లో ప్రతిఫలిస్తోంది. కార్లపై ఎర్ర లైటు (లాల్‌బత్తి) పెట్టుకు తిరగడంవల్ల పని సామర్థ్యం ఎలా పెరుగుతుందని సర్వోన్నత న్యాయస్థానం 2013 ఆగస్టులో సంధించిన సూటిప్రశ్నకు ఇప్పటిదాకా సరైన సమాధానం ఇచ్చినవారు లేరు. అధికార డాంబిక ప్రదర్శన చిహ్నంగా ఛీ కొట్టించుకొంటున్న లాల్‌బత్తిల వినియోగంపై మోదీ మంత్రివర్గం నిష్కర్షగా వేటు వెయ్యడాన్ని సహర్షంగా స్వాగతించాలిప్పుడు! అతి చేస్తే గతి చెడుతుందన్న నానుడికి ఎర్రబుగ్గ కార్లే సరైన ఉదాహరణ. ‘బుగ్గకారు కావాలి- బల్బు వెలిగిపోవాలి’ అంటూ సర్పంచులు సైతం లాల్‌బత్తి కార్ల కోసం వెంపర్లాడటాన్ని న్యాయపాలిక లోగడే ఈసడించింది. రాజకీయంగా సున్నితమైన ఈ అంశంపై కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ కొన్ని ప్రతిపాదనల్ని వారం రోజుల క్రితమే ప్రధానమంత్రి కార్యాలయానికి సమర్పించింది. లాల్‌బత్తి వినియోగానికి పూర్తిగా మం...

రేవంత్‌రెడ్డికి వ్య‌తిరేకంగా...టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల నినాదాలు....

Image
రేవంత్‌రెడ్డికి వ్య‌తిరేకంగా...టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల నినాదాలు.... AMRNEWS/TELANGANA - DESK: మెద‌క్ :      మెద‌క్ జిల్లా చింత‌మ‌డ‌క‌కు టీఆర్ఎస్ కార్య‌క‌ర్తు భారీగా చేరుకున్నారు. అనంత‌రం టీడిపి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి  వ్య‌తిరేకంగా టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు నినాదాలు చేస్తున్నారు. ఈమేర‌కు గ్రామశివారులో స్ధానికులు ముళ్ల కంచెలు వేశారు. అంతేకాకుండా టీడిపి అధ్య‌క్షురాలి వాహ‌నాన్ని అడ్డుకుని టీఆర్ఎస్ కార్య‌కర్త‌లు వెన‌క్కిపంపించారు. వాహ‌నాన్ని అడ్డుకోవ‌డంతో న‌డుచుకుంటూ గ్రామంలోకి రేవంత్‌రెడ్డి వెళ్తున్నారు. 

టీఎస్‌ ఐసెట్‌ దరఖాస్తుల స్వీకరణ గడువు పెంపు

Image
టీఎస్‌ ఐసెట్‌ దరఖాస్తుల స్వీకరణ గడువు పెంపు హైదరాబాద్‌: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న తెలంగాణ ఐసెట్‌కు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసేందుకు మరో రెండు రోజులు గడువు పెరిగింది. ఈనెల 18వరకు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని కన్వీనర్‌ ప్రకటించారు. ఇప్పటి వరకు సుమారు 62వేల మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఆలస్య రుసుము రూ.500లతో ఈనెల 24 వరకు, రూ.2వేలతో మే 2 వరకు, రూ.5వేలతో మే 8వరకు, రూ.10వేల ఆలస్య రుసుముతో మే 14 వరకు దరఖాస్తులు సమర్పించే అవకాశం ఉంటుంది. మే 18న ఐసెట్‌ పరీక్ష జరగనుంది. గతేడాది ఆలస్య రుసుము లేకుండా 69,568 మంది దరఖాస్తు చేసుకోగా.. ఆలస్య రుసుములతో మరో 4250 మంది దరఖాస్తు చేసుకున్నారు.

ఎయిర్‌టెల్‌ మరో బంపర్‌ ఆఫర్‌!

Image
ఎయిర్‌టెల్‌ మరో బంపర్‌ ఆఫర్‌! న్యూదిల్లీ: ప్రస్తుతం టెలికాం సంస్థల మధ్య డేటా వార్‌ నడుస్తున్న నేపథ్యంలో ఎయిర్‌టెల్‌ తన వినియోగదారులకు మరో భారీ ఆఫర్‌ తీసుకొచ్చింది. వచ్చే మూడు నెలల పాటు తన పోస్ట్‌పెయిడ్‌ చందాదారులకు ఉచిత డేటాను అందించనున్నట్లు తెలిపింది. ‘మై ఎయిర్‌టెల్‌’ యాప్‌ను లాగిన్‌ కావడం ద్వారా నెలకు 10జీబీ చొప్పున మూడు నెలల పాటు 30జీబీ డేటాను పొందవచ్చు. ‘వచ్చే మూడు నెలలు ఉచిత డేటాను ఆనందించండి. మీరు ఏదైనా దూర ప్రయాణానికి వెళ్లాలని ప్రణాళిక వేసుకుంటే అందుకు ఇది ఉపయోగపడుతుంది’ అని భారతీ ఎయిర్‌టెల్‌ సీఈవో గోపాల్‌ విఠల్‌ చందాదారులకు పంపిన ఈ-మెయిల్‌లో పేర్కొన్నారు.

మతపరమైన రిజర్వేషన్లు అడ్డుకుంటాం

Image
మతపరమైన రిజర్వేషన్లు అడ్డుకుంటాం హైదరాబాద్‌: తెలంగాణలో మతపరమైన రిజర్వేషన్లు కల్పించడాన్ని నిరసిస్తూ భాజపా ఎమ్మెల్యేలు ఈరోజు ఉదయం తెలుగుతల్లి ఫ్లైఓవర్‌ వద్ద గల అంబేడ్కర్‌ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర నిర్వహించారు. నల్లకండువాలు ధరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌వీఎస్‌ ప్రభాకర్‌, ఎమ్మెల్సీ రామచంద్రరావు పాదయాత్రలో పాల్గొన్నారు. అంబేడ్కర్‌ స్ఫూర్తితో మతపరమైన రిజర్వేషన్లు సభలో అడ్డుకుంటామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏకపక్ష నిర్ణయాలతో సభను ఆదివారం నిర్వహిస్తున్నారని లక్ష్మణ్‌ ఆరోపించారు.

రిజర్వేషన్ల పెంపు బిల్లుకు ఆమోదం

Image
రిజర్వేషన్ల పెంపు బిల్లుకు ఆమోదం   హైదరాబాద్‌: తెలంగాణలో బీసీ-ఈ, గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు బిల్లుకు తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. బీసీ-ఈలకు 4 నుంచి 12 శాతానికి, గిరిజనులకు 6 నుంచి 10 శాతానికి పెంచుతూ ప్రభుత్వం అసెంబ్లీలో ఆదివారం బిల్లును ప్రవేశపెట్టింది. ఈరోజు ఉదయం 11 గంటలకు శాసనసభ ప్రారంభమైన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ రిజర్వేషన్ల పెంపు బిల్లును సభలో ప్రవేశపెట్టారు. వివిధ పార్టీల సభ్యులు దీనిపై చర్చించి ప్రభుత్వానికి పలు సూచనలు అందించారు. భాజపా గిరిజనుల రిజర్వేషన్లకు మద్దతిస్తూనే.. ముస్లింల రిజర్వేషన్లు వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ముస్లింలకు ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వకూడదు? వారేం పాపం చేశారు? ఈ దేశంలో ముస్లింలు పౌరులు కాదా? వారు పన్నులు కట్టడంలేదా? కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి కచ్చితంగా 9వ షెడ్యూల్‌లో చేర్పించేలా చూస్తామన్నారు. కేంద్రం ఇందుకు అంగీకరించకపోతే అవసరమైతే పార్లమెంట్‌లో దీనికోసం పోరాటం చేస్తామన్నారు. వితండవాదంతో, మతం పేరుతో కొన్ని రాజకీయ పార్టీలు ముస్లింలకు రిజర్వేషన్లను వ్యతిరేకించడం సరికాదన్నారు. తాము ప్ర...

దట్టమైన అడవిలో కలెక్టర్‌ పర్యటన రెండున్నర కిలోమీటర్ల కాలినడక

Image
దట్టమైన అడవిలో కలెక్టర్‌ పర్యటన   రెండున్నర కిలోమీటర్ల కాలినడక   గంగారం: మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలంలోని దట్టమైన అడవిలో శనివారం జిల్లా కలెక్టరు ప్రీతిమీన కాలినడకన పర్యటించారు. గంగారం మండల కేంద్రంలో జరిగిన ప్రజావేదికకు కలెక్టరు ప్రీతిమీన హాజరయ్యారు. ప్రజల నుంచి ఎక్కువ మొత్తంలో పోడు సమస్యల పరిష్కారంపై వినతులొచ్చాయి. దీంతో తీవ్రంగా స్పందించిన కలెక్టరు... అటవీశాఖ జిల్లా అధికారి కిష్టగౌడ్‌ను ఈ విషయమై ప్రశ్నించారు. అటవీ ప్రాంతంలో పోడు చేస్తుండటంతో నియంత్రిస్తున్నామనీ... కావాలంటే పోడుచేసిన ప్రాంతాన్ని సందర్శించాలని ఆయన కోరారు. వెంటనే స్పందించిన కలెక్టరు ప్రజావేదిక కార్యక్రమం ముగియగానే వాహనాల్లో దట్టమైన అటవీ ప్రాంతమైన గంగారం సమీపంలోని మామిడితోగుకు చేరుకున్నారు. వాహనాలు వెళ్లలేకపోవడంతో అక్కడ సుమారు రెండు కిలోమీటర్ల దూరం కాలినడకన పర్యటించారు. మామిడితోగు అడవిలో జరిగిన పోడును పరిశీలించిన అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, పోడుదారులతో ఆమె మాట్లాడారు. పోడు వ్యవసాయమే ఆధారమైతే ఉపాధి కోసం ఇతర మార్గాలను కల్పించి, ఆర్థికంగా పరిపుష్టి సాధించేలా కృషిచేస్తానని వారికి హామీ ఇచ్చారు. అడవులను కాపాడ...

ఇచ్చిన హామీ మేరకే రిజర్వేషన్ల పెంపు

Image
ఇచ్చిన హామీ మేరకే రిజర్వేషన్ల పెంపు   హైదరాబాద్‌: రిజర్వేషన్ల పెంపు నిర్ణయం ఇప్పటిది కాదని.... గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానం మేరకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. రిజర్వేషన్ల బిల్లు సభలో ప్రవేశపెట్టడం చరిత్రాత్మకమైనదని అన్నారు. ముస్లింలు, గిరిజనుల రిజర్వేషన్ల పెంపు బిల్లును ఈరోజు ఆయన శాసనసభలో ప్రవేశపెట్టారు. ప్రస్తుత రిజర్వేషన్ల పెంపు వల్ల బీసీలకు ఎలాంటి నష్టం వాటిల్లదని కేసీఆర్‌ స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరాల్సిన భాధ్యత తమపై ఉందన్నారు. గిరిజనులు, బీసీ-2 వర్గాలకు రిజర్వేషన్లు కొత్త అంశమేమీ కాదన్నారు. సామాజిక, ఆర్థిక వెనుకబాటు వల్లే రిజర్వేషన్లు పెంచుతున్నట్లు తెలిపారు.

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల

Image
తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఈరోజు ఉదయం 10 గంటలకు విడుదలయ్యాయి. ఇంటర్‌బోర్డు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు. మార్చి నెలలో జరిగిన ఇంటర్‌ పరీక్షలను 9.76లక్షల మంది విద్యార్థులు రాశారు. ఫస్ట్‌ ఇయర్‌లో 4,75,874మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 2,70,738మంది ఉత్తీర్ణులయ్యారు. పాస్‌ శాతం 57. గతేడాది కంటే ఇది 6శాతం ఎక్కువ. అలాగే రెండో సంవత్సరంలో 4,14,213 మంది పరీక్ష రాయగా.. 2,75,273 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం 66.45. గతేడాది కంటే ఇది మూడు శాతం ఎక్కువ. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాలు తొలి రెండు స్థానాల్లో నిలిచాయి.  

సింహాల్ని ఆటాడుకున్నారు సన్‌రైజర్స్‌ దెబ్బకు గుజరాత్‌ విలవిల వణికించిన రషీద్‌.. చెలరేగిన వార్నర్‌, హెన్రిక్స్‌ హైదరాబాద్‌ ఖాతాలో మరో ఘనవిజయం

Image
సింహాల్ని ఆటాడుకున్నారు   సన్‌రైజర్స్‌ దెబ్బకు గుజరాత్‌ విలవిల   వణికించిన రషీద్‌.. చెలరేగిన వార్నర్‌, హెన్రిక్స్‌   హైదరాబాద్‌ ఖాతాలో మరో ఘనవిజయం   ఛాంపియన్‌ జట్టు దూసుకెళ్తొంది. ఐపీఎల్‌-10లో వరుసగా రెండు మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఎదురే లేదు. ప్రత్యర్థి నుంచి ఆ జట్టుకు పోటీయే లేదు. తొలి మ్యాచ్‌లో బెంగళూరును మట్టికరిపించిన సన్‌రైజర్స్‌.. రెండో పోరులో గుజరాత్‌ను మరింత చిత్తుగా ఓడించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌లో తేలిపోయిన గుజరాత్‌కు సొంతగడ్డపై చుక్కలు చూపించింది. బంతితో రషీద్‌ఖాన్‌.. బ్యాటుతో డేవిడ్‌ వార్నర్‌ చెలరేగడంతో సన్‌రైజర్స్‌ ఖాతాలో వరుసగా రెండో విజయం చేరింది. amr news - telangana  స న్‌రైజర్స్‌ మరోమారు సత్తాచాటింది. ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 9 వికెట్ల తేడాతో గుజరాత్‌పై విజయం సాధించింది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌ను 20 ఓవర్లలో 135/7కే కట్టడి చేశారు సన్‌రైజర్స్‌ బౌలర్లు. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రషీద్‌ ఖాన్‌ (3/19) ధాటికి గుజరాత్‌ నిలవలేకపోయింది. అనంతరం కెప్టెన్‌ వార్నర్‌ (76 నాటౌట్‌; 45 బంతుల్...

‘బాహుబలి’ మూడో భాగం అవసరం లేదేమో! - రాజమౌళి

Image
‘బాహుబలి’ మూడో భాగం అవసరం లేదేమో!   - రాజమౌళి   ‘‘బా హుబలి: ది బిగినింగ్‌’లోని ప్రేక్షకుల అన్ని సందేహాలకు ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’లో సమాధానం దొరుకుతుంది. రెండో భాగంతో ముగింపు పలికిన తర్వాత మూడో భాగం అవసరం లేదని భావిస్తున్నామ’’న్నారు ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ ఈ నెల 28న విడుదలవుతోంది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా ‘బాహుబలి’ చిత్ర బృందం ఆదివారం చెన్నైలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. రాజమౌళి మాట్లాడుతూ ‘‘వెయ్యేళ్ల క్రితం జరిగినట్లు వూహించుకుని రాసిన కథే ‘బాహుబలి’. అందుకే అప్పటి వేషధారణ, సామాజిక స్థితిగతులను ప్రతిబింబించేలా పాత్రలను రూపకల్పన చేశాం. అప్పట్లో ఎలాంటి ఆయుధాలు ఉపయోగించారో వూహించి వాటినే సినిమాలో వాడాం. ‘బాహుబలి’ కథ ఒకటే. నిడివి ఎక్కువగా ఉండటంతోనే రెండు భాగాలుగా తీశాం. ముఖ్యంగా మొదటి, రెండో భాగంలోని పాత్రల మధ్య జరిగిన సంఘర్షణను ‘బాహుబలి 2’లో చూపించాం. ఒక సినిమా విజయం సాధిస్తే అదేపేరుతో మరో కథను అల్లుకుని తీసిన చిత్రం కాదు ఇది....

లాడెన్‌ తలలోకి ఎన్నిసార్లు కాల్చారో తెలుసా..!

Image
లాడెన్‌ తలలోకి ఎన్నిసార్లు కాల్చారో తెలుసా..!   వాషింగ్టన్‌: రాబర్ట్‌ ఓనీల్‌.. ప్రపంచాన్ని గడగడలాడించిన ఒసామా బిన్‌లాడెన్‌ను మట్టుబెట్టిన అమెరికా కమాండో. లాడెల్‌ ఆపరేషన్‌ వివరాలను తరచూ బయటపెడుతూ ఓనీల్‌ ఎన్నోసార్లు వార్తల్లో నిలిచాడు. తాజాగా ‘ది ఆపరేటర్‌’ పేరుతో ఓ పుస్తకాన్ని రచించాడు. దీనిలో బిన్‌లాడెన్‌ ఎన్‌కౌంటర్‌ జరిగిన తీరును కళ్లకు కట్టాడు. ఈ ఆపరేషన్‌ మొత్తం కేవలం 90నిమిషాల్లో పూర్తయినట్లు ఓనీల్‌ పేర్కొన్నాడు. మొత్తం ఆరుగురు నేవీ సీల్స్‌ బృందం(అమెరికాలోని అత్యున్నత కమాండోలు) బిన్‌లాడెన్‌ ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు తెలిపాడు. ఈ బృందంలో తాను కాల్చడం వల్లే బిన్‌లాడెన్‌ మృతిచెందినట్లు వెల్లడించాడు. ఆపరేషన్‌ జరిగింది ఇలా..   2011లో పాకిస్థాన్‌లోని అబౌట్టాబాద్‌లో లాడెన్‌ దాక్కొన్నట్లు భావిస్తున్న భవనంపై అమెరికన్‌ నేవీ సీల్స్‌ బృందం దాడి చేసింది. ఈ దాడిలో ఓనీల్‌ ముందు నడుస్తుండగా మరో ఐదుగురు నేవీ సీల్స్‌ ఆయన వెనుకే రెండో అంతస్తుకు చేరుకున్నారు. అక్కడే లాడెన్‌ ముగ్గురు భార్యలు, 17 మంది సంతానం ఉన్నట్లు భావించారు. అక్కడే ఒక వ్యక్తి ఏకే47 తుపాకీతో మెట్ల రెయిలింగ్‌ చాటున దాక్కొని...

ప్రింటింగ్ తప్పు.. వీసా హోల్డర్స్ గుండెల్లో గుబేలు

ప్రింటింగ్ తప్పు.. వీసా హోల్డర్స్ గుండెల్లో గుబేలు అసలకే ట్రంప్ ఇచ్చే షాక్ లతో గుండెలు గుబేలుమంటున్న వీసా హోల్డర్స్ కు, అక్కడి అధికారులు మరో ఝలక్ ఇచ్చారు. వీసా జారీలో తప్పుడు ప్రింటింగ్ వేయడంతో దేశీయ టెక్ ఇండస్ట్రీ వర్గాల్లో ఒక్కసారిగాలో గుబులు ప్రారంభమైంది. వీసా ప్రాసెసింగ్ సెంటర్స్ ఆధీనంలో పనిచేసే అమెరికా వీసా ప్రింటింగ్ ప్రెస్, పొరపాటున హెచ్1బీ కు బదులుగా 1బీ1 అని ప్రింట్ చేసింది. చాలామంది వీసాహోల్డర్స్ పిటిషన్లలో హెచ్1బీ బదులుగా 1బీ1ను ఆమోదిస్తున్నట్టు పేర్కొంది. దీంతో అమెరికా ప్రయాణించాలనుకునే వారిలో ఆందోళన ప్రారంభమైంది. హెచ్1బీకి అప్లయి చేస్తే 1బీ1 రావడమేమిటని తలలు పట్టుకున్నారు. ఇటీవలే సస్పెండ్ అయిన ప్రీమియం ప్రాసెసింగ్ ప్రొగ్రామ్ ను రెన్యూవల్ చేపించుకోవడానికి అప్లయి చేసిన విదేశీ పాస్ పోర్టు హోల్డర్స్ ఈ తప్పుడు ప్రింటింగ్ ను గుర్తించారు. వారితో పాటు మిగతా అభ్యర్థులు గుర్తించి, యూఎస్సీఐఎస్ ని సంప్రదించడం ప్రయత్నించారు.   కానీ వారు తమ గోడును వినిపించుకోలేదని హెచ్1బీ వీసా హోల్డర్స్ పేర్కొంటున్నారు.  వీసా జారీలో తప్పుడు ప్రింటింగ్ వీసా ఆఫీసర్ క్షమించరాని నేరమని, పిటి...

ఇద్దరు మావోయిస్టు సానుభూతిపరుల అరెస్ట్‌

ఇద్దరు మావోయిస్టు సానుభూతిపరుల అరెస్ట్‌ చర్ల: మావోయిస్టుల పోస్టర్లు అంటిస్తున్న ఇద్దరు మావో సానుభూతిపరులను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం వెకటాద్రిపాలెంలో ఇద్దరు వ్యక్తులు మావోయిస్టుల పోస్టర్లు అంటిస్తుండగా.. పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. మండలంలోని బూరుగుపాడుకు చెందిన మడలి జోగయ్య, మడలి జోగ అనే ఇద్దరు ఏరియ కమిటీకి సానుభూతిపరులుగా పని చేస్తున్నట్టు ఎస్సై సత్యనారాయణ తెలిపారు.