మీరాకే మా ఓటు

మీరాకే మా ఓటు రాష్ట్రపతి ఎన్నికలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి మీరా కుమార్ కే తమ మద్దతునివ్వాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మీరా కుమార్ ని తమ ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని 17 పార్టీల కూటమి ప్రకటించిన సంగతి విదితమే. అభ్యర్థి ఎంపికపై విపక్షాలు జరిపిన చర్చల్లో పాల్గొనేందుకు ఆప్ కు అనుమతి లభించలేదు. అయినా, ఈ పార్టీ మాత్రం మీరా కుమార్ అభ్యర్తిత్వానికే సపోర్ట్ చేయాలని నిశ్చయించుకున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్డీయే క్యాండి డేట్ రామ్ నాథ్ కు మద్దతు నిచ్చే ప్రసక్తి లేదని ఈ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రపతి ఎన్నికను బాయ్ కాట్ చేయబోమని, ఈ ఎలెక్షన్ లో పాల్గొంటామని ఆప్ వర్గాలు స్పష్టం చేశాయి.