బాయ్‌కాట్ చేస్తాం

బాయ్‌కాట్ చేస్తాం

జీఎస్టీ పై ఈ నెల 30 అర్ధరాత్రి జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశానికి హాజారు కారాదని ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నిర్ణయించింది. పార్టీ అధినేత్రి సోనియా ఇతర నేతలతో కలిసి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో భేటీ అయ్యాక ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. మొదట పార్లమెంట్ మిడ్ నైట్ సమావేశానికి హాజరు కావాలా, వద్దా అని అంతర్గత చర్చలు జరిగాయని, ఇతర పార్టీలతోనూ సంప్రదింపులు జరిపామని పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ తెలిపారు. మోదీ ప్రభుత్వం ఎవరితోనూ చర్చించకుండా జీఎస్టీ పై హడావిడిగా నిర్ణయం తీసుకుందని ఆయన విమర్శించారు.
గతంలో తాము కూడా ఏకీకృత పన్నుల వ్యవస్థ గురించి ప్రస్తావించామని, అయితే బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు దాన్ని హైజాక్ చేసినంత పని చేసిందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. జీఎస్టీ వల్ల ముఖ్యంగా చిన్నా చితకా వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటారని, వారిని వేధించడమే అవుతుందని ఈ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అటు-లెఫ్ట్ పార్టీలు కూడా పార్లమెంట్ అర్ధరాత్రి సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించాయి. ఇంత హడావుడిగా దీన్ని ప్రవేశపెట్టడమేమిటని సీపీఎం సీనియర్ నేత సీతారాం ఏచూరి ప్రశ్నించారు. బీజేపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దీన్ని వ్యతిరేకించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాగా ఈ సమావేశాన్ని బాయ్ కాట్ చేస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేతృత్వం లోని తృణమూల్ కాంగ్రెస్ ఇది వరకే ప్రకటించింది. జీఎస్టీ ని పెద్ద పొరబాటు చర్యగా మమత అభివర్ణించారు.

Comments

Popular posts from this blog

రాక్షస గుహలు.. సొరంగ మార్గాలు.

ఎర్రబెల్లి కుటుంబసభ్యులకు సీఎం పరామర్శ

'కప్పిపుచ్చుకోవడానికే రిజర్వేషన్లు'