Posts

Showing posts from June, 2017

మీరాకే మా ఓటు

Image
మీరాకే మా ఓటు రాష్ట్రపతి ఎన్నికలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి మీరా  కుమార్ కే తమ మద్దతునివ్వాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మీరా కుమార్ ని తమ ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని 17 పార్టీల కూటమి ప్రకటించిన సంగతి విదితమే. అభ్యర్థి ఎంపికపై విపక్షాలు జరిపిన చర్చల్లో పాల్గొనేందుకు ఆప్ కు అనుమతి లభించలేదు. అయినా, ఈ పార్టీ మాత్రం మీరా కుమార్ అభ్యర్తిత్వానికే సపోర్ట్ చేయాలని నిశ్చయించుకున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్డీయే క్యాండి డేట్ రామ్ నాథ్ కు మద్దతు నిచ్చే ప్రసక్తి లేదని ఈ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రపతి ఎన్నికను బాయ్ కాట్  చేయబోమని, ఈ ఎలెక్షన్ లో పాల్గొంటామని ఆప్ వర్గాలు  స్పష్టం చేశాయి.

బాయ్‌కాట్ చేస్తాం

Image
బాయ్‌కాట్ చేస్తాం జీఎస్టీ పై ఈ నెల 30 అర్ధరాత్రి జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశానికి హాజారు కారాదని ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ నిర్ణయించింది. పార్టీ అధినేత్రి సోనియా ఇతర నేతలతో కలిసి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో భేటీ అయ్యాక ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. మొదట పార్లమెంట్ మిడ్ నైట్ సమావేశానికి హాజరు కావాలా, వద్దా అని అంతర్గత చర్చలు జరిగాయని, ఇతర పార్టీలతోనూ సంప్రదింపులు జరిపామని పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ తెలిపారు. మోదీ ప్రభుత్వం ఎవరితోనూ చర్చించకుండా జీఎస్టీ పై హడావిడిగా నిర్ణయం తీసుకుందని ఆయన విమర్శించారు. గతంలో తాము కూడా ఏకీకృత పన్నుల వ్యవస్థ గురించి ప్రస్తావించామని, అయితే బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు దాన్ని హైజాక్ చేసినంత పని చేసిందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. జీఎస్టీ వల్ల ముఖ్యంగా చిన్నా చితకా వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటారని, వారిని వేధించడమే అవుతుందని ఈ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అటు-లెఫ్ట్ పార్టీలు కూడా పార్లమెంట్ అర్ధరాత్రి సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయించాయి. ఇంత హడావుడిగా దీన్ని ప్రవేశపెట్టడమేమిటని సీపీఎం సీనియ...

మళ్లీ అమెరికాకు.. ఏమైంది?

Image
మళ్లీ అమెరికాకు.. ఏమైంది? Today రజనీకాంత్‌ పొలిటికల్ ఎంట్రీపై ఎన్నోగాసిప్స్.. మరెన్నోవార్తలు. ఈ క్రమంలో డిసెంబర్ 12న అంటే తన పుట్టినరోజున ఈ అంశంపై సూపర్‌స్టార్ క్లారిటీ ఇవ్వడం ఖాయమని భావించారు. రజనీ మాత్రం ఇంకా రాజకీయ ప్రవేశంపై సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది. రాజకీయాలపై చర్చలు జరుగుతున్నాయని ఒకసారి, ఒకవేళ వస్తే సమాచారం ఇస్తామని మరొకసారి ఇలా చెబుతూ వచ్చారు సూపర్‌స్టార్ అండ్ కుటుంబసభ్యులు. ప్రస్తుతం రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన నుంచి ఆయన డ్రాపైనట్టు చెన్నై సమాచారం. ఆయన ఆరోగ్యమే ముఖ్యకారణంగా చెబుతున్నారు. కొన్నాళ్ల కిందట సింగపూర్‌లో ఆపరేషన్ చేయించుకున్నప్పటి నుండి ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంటోంది.  కబాలి రిలీజ్‌కు ముందు అమెరికా వెళ్లి ట్రీట్‌మెంట్ చేయించుకున్నారు. ఎట్ ప్రజెంట్ వైద్య పరీక్షల కోసమే ఆయన ముంబై  నుంచి అమెరికా వెళ్లారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన రాజకీయాల్లోకి వస్తే ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఆయన  ఫ్యామిలీ సభ్యులు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. అందుకే రజనీకాంత్‌ని రాజకీయాల్లోకి వద్దని ఫ్యామిలీ సభ్యులు అన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ...